ప్రైవేట్‌ స్కూళ్లను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-12-20T04:16:03+05:30 IST

ప్రైవేట్‌ స్కూళ్లను ప్రభుత్వం ఆదుకోవాలి

ప్రైవేట్‌ స్కూళ్లను ప్రభుత్వం ఆదుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న వడుప్సా జిల్లా అధ్యక్షుడు రమే్‌షరావు

వడుప్సా అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు ఎన్‌.రమే్‌షరావు


వరంగల్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌, డిసెంబరు 19: రాష్ట్రంలోని ప్రయివేటు పాఠశాలలను ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహాలను ఇస్తూ ఆదుకోవాలని వడుప్సా జిల్లా అధ్యక్షుడు నెమరుగొమ్ముల రమే్‌షరావు డిమాండ్‌ చేశారు. కొవిడ్‌ మూలంగా ప్రయివేటు విద్యాసంస్థలను సర్కారు నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఫలితంగా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని విమర్శించారు. హన్మకొండ హంటర్‌రోడ్డులోని జేఎ్‌సఎం ఉన్నత పాఠశాలలో శనివారం వడుప్సా వరంగల్‌ అర్బన్‌ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన రమే్‌షరావు మాట్లాడుతూ... కొవిడ్‌-19 మహమ్మారితో కుదేలైన ప్రయివేటు పాఠశాలలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ప్రైవేటు విద్యాలయాలకు ప్రోత్సాహకాలు ఇస్తుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కరోనాతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో పాటు ఉపాధ్యాయుల జీవన స్థితిగతులు దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రైవేటు ఉపాధ్యాయులు కూలీలుగా మారిపోతున్నారని తెలిపారు. పరిశ్రమలకు కోట్లాది రూపాయల సబ్సిడీలు ఇచ్చినట్లే.. ప్రైవేటు విద్యాసంస్థలకు సైతం ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యాలతో చర్చించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరారు. పాఠశాలలను ప్రారంభింపజేసి ప్రతీ విద్యార్థికి రూ.20వేల చొప్పున ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందజేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వడుప్సా నాయకులు టీడీ టామి, వి.జ్ఞానేశ్వర్‌సింగ్‌, మాదాల సతీ్‌షకుమార్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుందర్‌రాజ్‌, వెంకటేశ్వర్లు, చక్రపాణి, రాజే్‌షకుమార్‌, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. 

Read more