రోడ్డు టెర్రర్‌

ABN , First Publish Date - 2020-11-28T04:36:52+05:30 IST

కామారెడ్డి జిల్లాలో రహదారులు టెర్రర్‌గా మారుతున్నా యి. వరుస రోడ్డు ప్రమాదాలతో జిల్లాలోని రహదారులు నెత్తురోడుతున్నాయి. జాతీయ రహదారులతో పాటు అంత ర్గత రహదారులోనూ అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అధిక ప్రాణనష్టం వాటిల్లడమే కాకుండా ఎంతో మంది క్షతగాత్రులు అవుతున్న ఘటనలు ఉన్నాయి.

రోడ్డు టెర్రర్‌
44వ నెంబర్‌ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాద దృశ్యాలు

కామారెడ్డి జిల్లాలో నెత్తురోడుతున్న రోడ్లు 

ప్రతీరోజు 2 నుంచి 4 వరకు రోడ్డుప్రమాదాలు 

సగటున ముగ్గురు మృత్యువాత

జాతీయ రహదారులపైనే అధికంగా ప్రమాదాలు 

అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణం

చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు

కామారెడ్డి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లాలో రహదారులు టెర్రర్‌గా మారుతున్నా యి. వరుస రోడ్డు ప్రమాదాలతో జిల్లాలోని రహదారులు నెత్తురోడుతున్నాయి. జాతీయ రహదారులతో పాటు అంత ర్గత రహదారులోనూ అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అధిక ప్రాణనష్టం వాటిల్లడమే కాకుండా ఎంతో మంది క్షతగాత్రులు అవుతున్న ఘటనలు ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదం జరుగుతుండడంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. జిల్లాలో ప్రతీరోజు మూడు నుంచి ఐదు వరకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో సగటున ముగ్గురు మృత్యువాత పడుతున్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. జాతీయ రహదారులపై నిఘా లేకపోవడం, డ్రైవర్లు మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వా హనాలను మితిమీరిన వేగంతో నడపడంతో పలువురి మరణానికి కారకులవుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల నాగిరెడ్డి పేట మండలంలోని జప్తీజానకంపల్లి వద్ద హైదరాబాద్‌-బోఽ దన్‌ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరగడంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గడిచిన 9నెలల కాలం లో కామారెడ్డి జిల్లాలో 338 రోడ్డు ప్రమాదాలు చోటు చేసు కోగా.. ఇందులో 149 మంది మృత్యువాత పడ్డారంటే రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవ చ్చు. అదేవిధంగా 201 ప్రాణాంతకంకాని రోడ్డు ప్రమాదాలు జరగగా 323 మందికి శరీరములో వివిధ చోట్ల గాయాలై ప్రాణాలతో బయటపడ్డారు.

అతివేగం, నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు

జిల్లా పరిధిలోని జాతీయ రహదారితో పాటు రాష్ట్ర ర హదారుల్లో ఇటీవల చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాలు అ తివేగం, నిర్లక్ష్యం కారణంగానే ఎక్కువగా జరిగినట్లు పోలీసు లు పేర్కొంటున్నారు. సుమారు 100వరకు ప్రమాదాలు స్వీ య తప్పిదం వల్ల, 243 ఘటనలు అంటే 72 శాతం ప్రమా దాలు కేవలం ద్విచక్రవాహనదారులవేనని, సుమారు 50 శా తం ప్రమాదాలు పంచాయతీరాజ్‌, చిన్నచిన్న రోడ్లపై నే, మ రణించిన 149 మందిలో 92 మంది యుక్త, మధ్య వ యసు లో ఉన్నవారేనని, సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9గం టల వరకు అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని పో లీసులు పేర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లాలో 41 శాతం రో డ్డు ప్రమాదాలు దేవునిపల్లి, భిక్కనూరు, సదాశివనగర్‌, బా న్సువాడ పరిధిలో జరిగినవి కావడం గమనార్హం.

అంతంత మాత్రంగానే హైవే పెట్రోలింగ్‌ 

జిల్లాలో 44, 63వ నెంబర్‌ జాతీయ రహదారులు ఉన్నా యి. ఈ రహదారులపై నిత్యం వేలాది వాహనాలు ఓవర్‌ స్పీడ్‌తో వెళ్తుంటాయి. కానీ ఈ హైవేలపై పోలీసు శాఖ, జా తీయ రహదారి నిర్వహణ సంస్థ పెట్రోలింగ్‌ అంతంతమా త్రంగానే ఉండడంతో రహదారులు ప్రమాదాలతో నెత్తురోడుతున్నాయి. టెక్రియాల్‌, బస్వాపూర్‌, సదాశివనగర్‌, గాం ధారి, భిక్కనూరు ఎక్స్‌రోడ్డు తదితర ప్రాంతాల వద్ద అధికం గా రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు జిల్లా పోలీస్‌శాఖ గుర్తించింది. జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో వాహనాలను నడిపేవారిపై నిఘా పెట్టాల్సిన బాధ్యత హైవే పెట్రోలింగ్‌ పార్టీలతో పాటు రహదారిపై ఉన్న పోలీసు స్టేషన్‌ అధికారులకు అప్పగించినప్పటికీ వారు పెట్రోలింగ్‌ చేయ డంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట జరుగుతున్న రో డ్డు ప్రమాదంలో అధికంగా డ్రైవర్‌లు మద్యం మత్తులో వాహనాలు నడపడం, అతివేగం వల్ల జరిగిన ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయి. ఇ లాంటి ప్రమాదాలను నియంత్రించాలని గతం లో ప్రభుత్వ ఆదేశాల మేరకు సంబంధిత పోలీసు యంత్రాంగం హైవేలపై ప్రత్యేక పెట్రోలింగ్‌ వాహనాలను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా మద్యం మత్తులో వాహనాలను నడిపే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకునేందుకు హైవేపై బ్రీత్‌ ఎన్‌లైజర్లను సైతం అందుబాటులో ఉంచారు. వాహనాల స్పీడ్‌ తగ్గించేందుకు స్పీడ్‌ గన్‌ లాంటి నిఘా కెమెరాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోతో ంది. వాహనాల అతి వేగానికి పోలీసు శాఖ కల్లెం వేయలేక పోతోందనే వాదన ప్రజల నుంచి వినబడుతోంది. రహదారులపై రోడ్డు రవాణా శాఖ, పోలీసు శాఖలు నిఘా పెట్టకపోవడంతోనే తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా యని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

శాఖల మధ్య సమన్వయ లోపం

పోలీసు, ఆర్‌టీఏ అధికారులు, ఆర్‌అండ్‌బీ శాఖల మధ్య సమన్వయలోపంతోనే అమాయకుల ప్రాణాలు గాలిలో క లుస్తున్నాయి. జిల్లాలో ప్రతియేటా జరుగుతున్న రోడ్డు ప్ర మాదాలను నియంత్రించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం పై ఎంతైనా ఉంది. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతియేటా రోడ్డు రవాణా, పోలీసు శాఖలు రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ ఫలితం కానరావడం లే దు. ప్రమాదాలకు కారణాలను అధికారులు పసిగట్ట లేకపోతున్నారు. అనుభవంలేని డ్రైవర్‌లతో భారీ వాహనాలను జాతీయ రహదారిపై నడపడంతో, డ్రైవర్‌లు మద్యం మత్తులో మితిమీరిన వేగంతో వాహనాలు నడపడంతో ప్రమాదా లు చోటుచేసుకుంటున్నాయి. ఇవేకాకుండా ఆటోలలో పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకుని పో వడంతో, అవి అదుపు తప్పి ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సమయాల్లో భారీగా ప్రాణనష్టం సంభవిస్తోం ది. ఇలాంటి ఘటనే ఇటీవల నాగిరెడ్డి మండలంలో చోటుచే సుకుంది. జాతీయ రహదారిపైనే కాకుండా జిల్లా అంతర్గత రోడ్లలో తరచూ ప్రమాదాలు జరిగే చోట సూచిక బోర్డులు పెట్టకపోవడంతో వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో అమా యకులు వారి ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఇలాంటి ప్రమాదాలపై ఇప్పటికైనా సం బంధిత శాఖల అధికారులు ప్రజలకు అవగాహన కల్పించా ల్సి అవసరం ఎంతైనా ఉంది. 

Read more