తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేయాలి

ABN , First Publish Date - 2020-12-02T04:56:56+05:30 IST

తడి, పొడి చెత్తను వేరుచేసి తడి చెత్తతో సేంద్రి య ఎరువులు తయారు చేసి రైతులకు విక్రయించి గ్రామ పంచాయతీ ఆదా యం పెంపొందించుకోవాలని కలెక్టర్‌ శరత్‌ అన్నారు.

తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేయాలి
రామారెడ్డి తహసీల్‌ కార్యాలయంలో ధరణిలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వ్యక్తికి పట్టా పాస్‌పుస్తకం నకలు అందజేస్తున్న కలెక్టర్‌ శరత్‌

రామారెడ్డి, డిసెంబరు 1: తడి, పొడి చెత్తను వేరుచేసి తడి చెత్తతో సేంద్రి య ఎరువులు తయారు చేసి రైతులకు విక్రయించి గ్రామ పంచాయతీ ఆదా యం పెంపొందించుకోవాలని కలెక్టర్‌ శరత్‌ అన్నారు. మంగళవారం రామా రెడ్డి మండల తహసీల్దార్‌ కార్యాలయంలో పల్లె ప్రగతి కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించి పలు విషయాలు మాట్లాడారు. అలాగే హరితహార ంలో నాటిన మొక్కలను తప్పనిసరిగా 85 శాతం సంరక్షించాలని, అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలకు పాదులు తీసి చుట్టూ కంచె, రక్షణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. త్వరగా శ్మశానవాటికలు వాడుకలోకి తీసుకరావాలని తెలిపారు. గ్రామాల్లో ప్రతీ రోజు తడి, పొడి చెత్తను కంపోస్టు షెడ్డుకు తరలిం చాలని, తప్పకుండా తడి, పొడి చెత్తను వేరు చేయాలని పేర్కొన్నారు. అలాగే ధరణిలో రిజిస్ర్టేషన్‌ చేసుకున్న లబ్ధిదారులకు పారదర్శకంగా ఉండాలని స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి తేదీ ప్రకారం 20 నిమిషాలలో రికార్డు మార్పు జరిగి నకలు అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు రిజిస్ర్టేషన్‌ చేసు కున్న వారికి నకలు పాసు పుస్తకం  అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ కేశవ్‌ హేమంత్‌ పాటిల్‌, డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి, ఇన్‌చార్జీ డీపీవో సాయన్న, ఎంపీడీవో శంకర్‌నాయక్‌, తహసీల్దార్‌ షర్పోద్దీన్‌, ఎంపీవో సవిత తదితరులు పాల్గొన్నారు.
నట్టల నివారణ మందులను
గొర్రెలు, మేకల పెంపకందారులు వినియోగించుకోవాలి

కామారెడ్డి: గొర్రెల, మేకల పెంపకందారులు ఉచిత నట్టల మందును విని యోగించుకోవాలని కలెక్టర్‌ శరత్‌ తెలిపారు. మంగళవారం కామారెడ్డి మండ లం ఇస్రోజివాడి గ్రామంలో జిల్లా పశు సంవర్థకశాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలు, మేకల పోషణ వృత్తిగా చేపట్టి వేలాది మందికి ఆర్థిక సంక్షేమం కింద ఈ నెల 1 నుంచి 7 వరకు ఉచిత నట్టల మందు పంపిణీ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. జిల్లాలో సుమారు 8 లక్షల గొర్రెలు, మేకలకు నిర్వహించే నట్టల నివారణ కార్యక్రమాన్ని వినియోగించుకొని పెంపకందారులు నట్టల నివారణ మందులు గొర్రెలు, మేకలకు తాగించుకోవాలని తద్వారా అవి రోగ నిరోధక శక్తి పెంపొందించుకొని ఆరోగ్యంగా ఎదుగుతాయని, అధిక మాంసోత్పత్తి పొంది ఆర్థికంగా లాభపడవచ్చని తెలిపారు. జిల్లాలో 50 పశువైద్య టీంలు ప్రతీ గ్రామానికి వచ్చి ఉచిత నట్టల నివారణ మందు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి జగన్నాథచారి, ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, సర్పంచ్‌ మమత, రాజు, పశువైద్యులు రవికిరణ్‌, గొర్రెల, మేకల పెంపకందారుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.
ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికే ధరణి వెబ్‌సైట్‌
సదాశివనగర్‌ : ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికే ప్రభు త్వం ధరణి వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసిందని కలెక్టర్‌ శరత్‌ అన్నారు. మంగళవా రం మండలంలో పర్యటించి రైస్‌మిల్లులో వరి ధాన్యం, బియ్యం ఉత్పత్తిని పరిశీలించారు. సదాశివనగర్‌లో నిర్మించిన వర్మి కంపోస్ట్‌ షెడ్‌ను పరిశీలించా రు. అనంతరం తహసీల్ధార్‌ కార్యాలయంలో ధర్మారావుపేట్‌కు చెందిన కుమ్మరి భూమవ్వ నుంచి గిఫ్ట్‌డీడ్‌గా కొడుకు రాములుకు రిజిస్ట్రేషన్‌ పట్టా పాస్‌ పుస్తకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్ధార్‌ రవీందర్‌, గిర్దావర్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T04:56:56+05:30 IST