డబుల్‌ ఇళ్ల పనులను త్వరగా పూర్తిచేయాలి..

ABN , First Publish Date - 2020-06-23T11:03:29+05:30 IST

జిల్లాలో చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. క

డబుల్‌ ఇళ్ల పనులను త్వరగా పూర్తిచేయాలి..

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లాలో చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌ లో సోమవారం డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై ఆ యన అధికారులతో సమీక్షించారు. వచ్చే దసరా నాటికి ఇళ్లను ప్రారంభించే విధంగా నిర్మాణం పూర్తిచేయాలన్నారు. నాగారంలో పూర్తయిన ఇళ్లకు మిషన్‌ భగీరథ ద్వారా నీటి సరఫరాను అందించాలన్నారు.


రెండో దశ ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలన్నారు. ఈ ఇళ్లకు అవసరమైన ఇసుకను వెంటనే కేటాయించాలని ఆర్డీవోలను ఆ దేశించారు. ఇళ్లకు కరెంటు సరఫరా ఇవ్వాలన్నారు. ఇత ర నియోజకవర్గాల్లో మంజూరైన ఇఽళ్లను వెంటనే చేపట్టాలన్నారు. పనులన్ని ప్రారంభించి దసరా నాటికి పూ ర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో  డీసీవో సింహాచలం, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, ఇం జనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు. 

Read more