చాటింపు వేస్తున్నారు.. కరెంట్‌ బిల్లులు కట్టిస్తున్నారు!

ABN , First Publish Date - 2020-03-25T15:02:54+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికి స్తోంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ చేపట్టింది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. రోడ్లపై తిరగకుండా, ప్రజలు

చాటింపు వేస్తున్నారు.. కరెంట్‌ బిల్లులు కట్టిస్తున్నారు!

  • నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్‌శాఖ తీరు

రుద్రూరు, మార్చి 24 : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికి స్తోంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ చేపట్టింది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. రోడ్లపై తిరగకుండా, ప్రజలు గుంపులుగా ఉండకుండా చర్యలు చేపట్టారు. అయితే ఇదంతా బాగున్నప్పటికి విద్యుత్‌ అధికారులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రుద్రూరు మండలంలోని అంబం(ఆర్‌) గ్రామంలో సోమవారం రాత్రి విద్యుత్‌ బకాయిలను చెల్లించేందుకు చాటింపు వేసి మంగళవారం ఉదయం హనుమాన్‌ మందిరం వద్దకు అందరిని ఒక చోట చేరేలా వ్యవహరిస్తున్నారు. జనాలు గుంపులుగా ఒక చోటకు చేరితే ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నా ఇవేమీ ఆ శాఖ అధికారులకు పట్టడం లేదు. అధికారులు ఇప్పటికైనా తీరు మార్చుకుని కరోనా కట్టడికి తమ వంతు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-03-25T15:02:54+05:30 IST