రైతు ముఖంలో నవ్వు చూడాలన్నదే సీఎం కల

ABN , First Publish Date - 2020-06-25T11:16:05+05:30 IST

అన్నంపెట్టే రైతు ముఖంలో ఎల్లప్పుడు నవ్వు చూడాలన్నదే సీఎం కేసీఆర్‌ కల అని రాష్ట్ర రోడ్లు

రైతు ముఖంలో నవ్వు చూడాలన్నదే సీఎం కల

మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి  

రైతు వేదిక భవనాల 

నిర్మాణానికి శంకుస్థాపన


వేల్పూర్‌ / కమ్మర్‌పల్లి/ మోర్తాడ్‌ /ముప్కాల్‌, జూన్‌ 24: అన్నంపెట్టే రైతు ముఖంలో ఎల్లప్పుడు నవ్వు చూడాలన్నదే సీఎం కేసీఆర్‌ కల అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వేల్పూర్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర రైతు మాజీ అధ్యక్షుడు, దివంగత వేముల సురేందర్‌ రెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మించే రైతు వేదిక భవనా నికి, కమ్మర్‌పల్లిలో, మోర్తాడ్‌ మండలం పాలెం గ్రామంలో, ముప్కాల్‌లో  రైతు వేదికల నిర్మాణ పనులకు బుధవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రైతులకు ఇంకా ఏదైనా చేయాలని ప్రతీ రోజు సీఎం కేసీఆర్‌ తపన పడుతుం టార న్నారు. కాళేశ్వరం, ఉచిత కరెంటు పెట్టుబడి సహాయం అందిస్తున్నామన్నారు. రైతులంతా ఒకచోట కూర్చొని వ్యవసా య సాగు విషయమై మాట్లాడుకునేందుకు, పంటల గురించి రైతులతో నేరుగా చర్చించేందుకు రైతులు సంఘటితం కా వడానికి ఒక వేదిక అవసరమి సీఎం ఆలోచన అన్నారు. ఆ ఆలోచనతో పుట్టిందే రైతు వేదిక భవన నిర్మాణాలన్నారు. సొంత గ్రామమైన వేల్పూర్‌లో సొంత ఖర్చులతో రైతు వేదిక భవనం నిర్మాణం చేస్తున్నామన్నారు.


తెలంగాణలో బోరుబా వుల తవ్వకం కోసం రైతులు రూ. 40 వేల కోట్లు ఖర్చు చేశా రని, ఈ డబ్బులతో రెండు ఎస్సారెస్పీ ప్రాజెక్టులు నిర్మించుకో వచ్చని అన్నారు. రూ. 11 కోట్లతో వేల్పూర్‌లో పడిగెల నవా బు లిఫ్ట్‌ ఏర్పాటు చేసి చెరువులు నింపుతున్నామన్నారు. రూ.4 వేల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు చేపట్టామన్నారు. సోయా విత్తనాలు మొలకెత్తక నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామన్నారు. ఎస్సారెస్పీ వరద కాలు వలో తొమ్మిది తూములు ఏర్పాటు చేసి చెరువులు నింపుతు న్నామన్నారు.


కమ్మర్‌పల్లిలో హరితహారం పేర చేయించిన మాస్క్‌లను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ రమేష్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొట్టాల చిన్నారెడ్డి, వేల్పూర్‌ ఎంపీపీ భీమ జమున, జడ్పీటీసీ భారతి, తహసీల్దార్‌ సతీష్‌ రెడ్డి, ఎంపీడీవో కమలాకర్‌రావు, కమ్మర్‌ పల్లి ఎంపీపీ లోలపు గౌతమి, జడ్పీటీసీ రాధ, మార్కెట్‌ కమి టీ చైర్మన్‌ మలావత్‌ ప్రఖాశ్‌ నాయక్‌, పార్టీ మండలాఽ ద్యక్షుడు దేవేందర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కోఆర్డినేటర్‌ బద్దం రాజేశ్వర్‌, సర్పంచ్‌ల ఫోరం మండలధ్యక్షుడు గడ్డం స్వామి, మోర్తాడ్‌ ఎంపీపీ శ్రీనివాస్‌, జడ్పీటీసీ రవి, ఏఎంసీ వైస్‌ చైర్మ న్‌ పాపాయి పవన్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ పర్సదేవన్న, ముప్కాల్‌ ఎంపీపీ సామ పద్మ, జడ్పీటీసీ నర్సవ్వ,  వె ౖస్‌ ఎంపీపీ రాజన్న, పార్టీ మండలాద్యక్షుడు భూమేశ్వర్‌, ఆర్‌ ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ ముత్తెన్న, వివిధ గ్రామాల సర్పం చ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 


పనులను వేగవంతం చేయాలి..

వేల్పూర్‌ : ఎస్సారెస్పీ ద్వారా  ఆర్మూర్‌, బాల్కొండ, నిజా మాబాద్‌ రూరల్‌  నియోజకవర్గాలకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా గోదావరి నీళ్లను తీసుకురావడానికి చేపట్టిన ప్యాకేజ్‌-20, ప్యాకేజ్‌-21 పనులను వేగవంతం చేయాలని మంత్రి ప్రశాం త్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం వేల్పూర్‌లో ఇరిగేషన్‌ అధికా రులతో సమీక్షించారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవం పథకం ద్వారా లక్షలాది ఎకరాలకు నీరందుతుందన్నారు. పలు పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, పనులు కొనసాగుతున్న ప్రదేశాలు రైతులు అడ్డుకోవద్దని కోరారు. చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంలో లీకేజీలు, మరమ్మతులు పూర్తి చేయకపోతే సంబంధిత ఏజెన్సీని తొలంగించాలని ఆదేశించారు.


త్వరలోనే పార్టీ కార్యాలయం ప్రారంభం..

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కా ర్యాలయాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన పార్టీ కార్యాలయం ని ర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. దాదా పు పనులు పూర్తయ్యాయని త్వరలోనే ప్రారంభోత్సవం చే స్తామన్నారు. సుశిక్షితులైన కార్యకర్తలను తయారుచేయడానికి శిక్షణ వేధికగా, ప్రజల సమస్యలు పరిష్కారానికి పార్టీ కార్యాలయంగా ఉపయోగపడుతుందని అన్నారు. ఆయన వెంట జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నూడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు. 


డ్రైవర్‌లకు కోవిడ్‌ ప్రొటెక్షన్‌ కిట్ల అందజేత..

వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వాహనాల డ్రైవర్‌లకు బుధవారం మంత్రి ప్రశాంత్‌రెడ్డి కోవిడ్‌ ప్రొటెక్షన్‌ కిట్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ రాకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, డీటీసీ వెంకట రమ ణ, రాములు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-25T11:16:05+05:30 IST