కోవిడ్‌, సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక అధికారుల నియామకం

ABN , First Publish Date - 2020-05-24T11:19:25+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం కరోనా ను కట్టడి చేసేందుకు ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య

కోవిడ్‌, సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక అధికారుల నియామకం

నిజామాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం కరోనా ను కట్టడి చేసేందుకు ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అమర్‌సింగ్‌ నాయక్‌, డిప్యూటీ డైరెక్టర్‌ డి.వెంకటేష్‌లను నిజామాబాద్‌, కా మారెడ్డి, ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలకు ఇన్‌ఛార్జిలుగా నియమించారు. వీరి ఆధ్వర్యంలో కోవిడ్‌-19 నియంత్రణ చర్యల ను చేపట్టనున్నారు.


కరోనా కట్టడి చేయడంతో పాటు వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అ నుగుణంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కరోనాను కట్టడి చేయనున్నారు. వీరు కరోనాను కట్టడి చేసేందుకు సూచనలు ఇవ్వడంతో పాటు సీజనల్‌ వ్యాధులపై కూడా దృష్టిపెడుతారు. వ్యాధుల నియంత్రణకు కూడా చర్య లు తీసుకునేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షలు ని ర్వహిస్తారు. వ్యాధులను అరికట్టేందుకు గ్రామస్థాయి నుంచి చర్యలను చే పట్టే విధంగా నిర్ణయాలను తీసుకుంటారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను ప్రభుత్వానికి నివేదిస్తారు. 

Updated Date - 2020-05-24T11:19:25+05:30 IST