నేడు జాతీయ రహదారి ప్రారంభోత్సవం

ABN , First Publish Date - 2020-12-21T04:44:25+05:30 IST

నేడు జాతీయ రహదారి ప్రారంభోత్సవం

నేడు జాతీయ రహదారి ప్రారంభోత్సవం

హన్మకొండ, డిసెంబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి-వరంగల్‌ జాతీయ రహదారి 163ని సోమవారం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్గరీ ప్రారంభోత్సం చేయనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. రూ.1889.72కోట్ల వ్యయంతో 54 కి.మీ. నుంచి 150 కి.మీ. వరకు నిర్మించిన 93.103 కి.మీ. ఈజాతీయ రహదారిని కేంద్రమంత్రి ఈ సందర్భంగా జాతికి అంకితం చేస్తారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు.  ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ సమీపంలో కరుణాపురం తోరణం ఎదురుగా ఉన్న ప్రాంతాన్ని ఇందుకు వేదికగా నిర్ణయించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ప్రదర్శన ఇక్కడే ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-12-21T04:44:25+05:30 IST