ప్రజా ఉద్యమాలతో ప్రభుత్వాలకు బుద్ధిచెపుతాం

ABN , First Publish Date - 2020-12-28T05:21:14+05:30 IST

టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తికావస్తున్నా ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు.

ప్రజా ఉద్యమాలతో ప్రభుత్వాలకు బుద్ధిచెపుతాం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి 

కోదాడ రూరల్‌, డిసెంబరు 27: టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తికావస్తున్నా ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. పట్టణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రిని కలవాలంటే ఫాంహౌస్‌కు వెళ్లాలని, ప్రగతి భవన్‌లో ఎవరికీ అందుబాటులో ఉండరన్నారు. మంచిగా ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి వేల కోట్లతో కొత్తగా నిర్మిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. మూ డు, నాలుగు మాసాలుగా రిజిస్ర్టేషన్లు కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నార న్నారు. ఉద్యోగులకు పీఆర్సీ హామీలు చేయలేదన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలకు ప్రజా ఉద్యమాలతోనే బుద్ధిచెబుతామన్నారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు ముల్కలపల్లి రాములు, మేదరమెట్ల వెంకటేశ్వర్లు, ముత్యాలు, దాసరి శ్రీనివాస్‌ ఉన్నారు.

Read more