కేంద్రం చట్టాలు అసమంజసం

ABN , First Publish Date - 2020-12-08T05:10:58+05:30 IST

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చట్టాలతో రైతు నుంచి రూ.10కి కొనుగోలు చేసి మనకు రూ.100కు విక్రయించే పరిస్థితి ఏర్పడుతుందని, పేద, మధ్య తరగతి వర్గాలు రెండు పూటలా తినే పరిస్థితి ఉండదని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు.

కేంద్రం చట్టాలు అసమంజసం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీ్‌షరెడ్డి

మంత్రి జగదీ్‌షరెడ్డి

నల్లగొండ, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చట్టాలతో రైతు నుంచి రూ.10కి కొనుగోలు చేసి మనకు రూ.100కు విక్రయించే పరిస్థితి ఏర్పడుతుందని, పేద, మధ్య తరగతి వర్గాలు రెండు పూటలా తినే పరిస్థితి ఉండదని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం నల్లగొండలో విలేకరుల సమావేశంలో ఆయనతో మాట్లాడారు. చట్టాలు ఉపసంహరించేలా కేంద్రం మెడలు వంచుతామన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపునకు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అన్ని స్థాయిల్లోని పార్టీ శ్రేణులు ఈ ఆందోళనలో పాల్గొనాలన్నారు. వ్యవసాయాన్ని అదానీ, అంబానీ వంటి కార్పొరేట్‌లకు ధారాదత్తం చేసేందుకే మోదీ ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకొచ్చిందన్నారు. కొత్త చట్టాలతో బ్లాక్‌ మార్కెట్‌పై చర్యలు తీసుకోలేమని, ధరలు అమాంతం పెరుగుతాయన్నారు. కార్పొరేట్‌ కంపెనీలు ఉత్పత్తులను ఎంతైనా నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అప్పుడు వారు ఇష్టారీతిన ధరలు నిర్ణయిస్తారని, దీంతో రైతులే కాదు, పట్టణ ప్రజలు సైతం నష్టపోతారన్నారు. ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడంతోనే ప్రైవేటు వ్యక్తులు దానికి సమాన ధర చెల్లిస్తున్నారన్నారు. మార్కెట్‌లో రైతుకు చెల్లించే ధర విషయంలో పోటీ ఉండాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-08T05:10:58+05:30 IST