సీసీఎంబీపై తొలిగిన నీడలు

ABN , First Publish Date - 2020-07-08T09:58:28+05:30 IST

యాదాద్రి జిల్లా లో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మలిక్యులర్‌ బయోలజీ (సీసీఎంబీ) పరిశోధనా ..

సీసీఎంబీపై తొలిగిన నీడలు

పరిశోధన సంస్థ ఏర్పాటుకు మార్గం సుగమం

భూ సేకరణ పరిహార చట్టంలో మినహాయింపులు

బొమ్మాయిపల్లి, పగిడిపల్లి భూసేకరణలకు ప్రభుత్వ ఉత్తర్వులు


యాదాద్రి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి జిల్లా లో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మలిక్యులర్‌ బయోలజీ (సీసీఎంబీ) పరిశోధనా కేంద్రంపై ఏర్పాటుపై దశాబ్దకాలంగా అలుముకున్న నీలినీడలు తొలగిపోయాయి. దీంతో ఆధునిక వైద్య విజ్ఞాన అభివృద్ధి కోసం మానవ కణాలపై పరిశోధనలకుగా ను సీసీఎంబీ ప్రతిపాదించిన ట్రాన్స్‌లేషనల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ను భువనగిరి పట్టణ శివారులో ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. తొలు త 2009లో బీబీనగర్‌ నిమ్స్‌ సమీపంలో సీసీఎంబీ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రతిపాదనలు న్యాయ వివాదాల కారణంగా నిలిచిపోయాయి. దశాబ్దకాలంగా ఈ వివాదం కొనసాగుతుండ గా, ప్రత్యామ్నాయ స్థలాన్ని ప్రతిపాదించి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును సాధించాలని యాదాద్రి జిల్లా అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. చివరికి భువనగిరి పట్టణశివారు బొమ్మాయిపల్లి, పగిడిపల్లి రెవెన్యూ గ్రామాల్లో ప్రభుత్వ భూములు, రైతుల నుంచి అసైన్డ్‌ భూముల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.


జాతీయ స్థాయి ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమికి పరిహారం చెల్లించేందు కు భూసేకరణ పరిహార చట్టం-2016 ప్రకారం మినహాయింపులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్వాసితులకు పరిహారం చెల్లింపులకుగాను సీసీఎంబీ ఇప్పటికే నిధులను రెవెన్యూ శాఖ వద్ద డిపాజిట్‌ చేయడంతో, భూసేకరణ ప్రక్రియ ఇక వేగవంతం కానుంది. దీంతో ప్రాజెక్టు ఏర్పాటు త్వరితగతిన పూర్తయ్యే అవకాశముందని అంతా భావిస్తున్నారు.


రూ.1200కోట్ల అంచనా వ్యయం

మనుషులకు సంక్రమించే వ్యాధులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలకుగాను మానవ కణాలపై పరిశోధనలు చేసేందుకు సీసీఎంబీ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతంలో ఏర్పాటు చేయాలని తొలు త ప్రతిపాదించింది. ఈ మేరకు బీబీనగర్‌ మండలం రంగాపూర్‌ వద్ద అప్పటి నిమ్స్‌, ప్రస్తుత ఎయిమ్స్‌ సమీపంలో రూ.1200కోట్ల అంచనా వ్యయంతోసీసీఎంబీ అనుబంధ వైద్య పరిశోధనా సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈమేరకు 184.06 ఎకరాల భూకేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి ప్రక్రియను ప్రారంభించింది. సర్వే నెంబర్‌ 42, 52, 54లో భూములు కేటాయించాలని సీసీఎంబీ డైరెక్టర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీని కి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 2009లో జీవో 373ని జారీ చేసింది. కాగా, ఈ స్థలాల్లో అప్పటికే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న సంస్థ హైకోర్టు ను ఆశ్రయించడంతో భూసేకరణ వివాదంగా మారింది.


ఇది భూసేకరణకు అడ్డంకిగా మారడంతో ప్రతిష్ఠాత్మక ఈ ప్రాజెక్టుకు ఏర్పడ్డ అవరోధాన్ని అధిగమించేందుకు అందుబాటులో ఉన్న అనువైన భూముల కేటాయింపుపై కలెక్టర్‌ అనితా రా మచంద్రన్‌, ఆర్డీవో ఎంవీ.భూపాల్‌రెడ్డి దృష్టి సారించారు. ఈమేరకు భువనగిరి పట్టణ శివా రు బొమ్మాయిపల్లి, పగిడిపల్లి రెవెన్యూ గ్రామాల్లో ప్రభుత్వ భూములను ప్రతిపాదించారు. వీటికి సీసీఎంబీ చైర్మన్‌, ఇతర అధికారులు సానుకూలత వ్యక్తం చేయడంతో భూసేకరణకు అవసరమైన చర్యలకు ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. 


భూసేకరణకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

భువనగిరి పట్టణ శివారులో హైదరాబాద్‌-భూపాలపట్నం జాతీయ రహదారికి సమీపంలో సీసీఎంబీ అనుబంధంగా ట్రాన్స్‌లేషనల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాక భూసేకరణ, పరిహారం పంపిణీ చట్టం- 2016 నుంచి మినహాయింపు కోసం సీసీఎంబీ పంపిన ప్రతిపాదనలను ప్రభు త్వం అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


భువనగిరి మండలం బొమ్మాయిపల్లి, పగిడిపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలో 120 ఎకరాల భూమి సీసీఎంబీ ఏర్పాటుకు అనువైన స్థలంగా రాష్ట్ర ప్రభుత్వానికి గతంలోనే కలెక్టర్‌ అని తా రామచంద్రన్‌ నివేది క సమర్పించారు. 120 ఎకరా ల్లో 48ఎకరాల అసైన్డ్‌ భూములు రైతుల వద్ద ఉండగా, వాటి సేకరణ కు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. బొమ్మాయిపల్లి రెవెన్యూ సర్వే నెంబర్‌ 85లో 41 ఎకరా లు, పగిడిపల్లి గ్రా మ రెవెన్యూ సర్వే నెంబర్‌ 86లో 79 ఎకరాల భూసేకరణ చేసి కేటాయింపుల ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే ఇనిస్టిట్యూట్‌ ల్యాబ్‌, భవనాలు నిర్మించేందుకు సీసీఎంబీ సిద్ధంగా ఉంది.

Updated Date - 2020-07-08T09:58:28+05:30 IST