ఏఎంవీఐలకు చెక్‌పోస్టుల వద్ద పోస్టింగ్‌

ABN , First Publish Date - 2020-12-07T05:53:01+05:30 IST

రవాణా శాఖ ఆదాయం పెంపుకోసం రాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీలను ప్రభుత్వం కట్టుదిట్టం చేస్తోంది. అందులో భాగంగా వివిధ జిల్లా రవాణా శాఖ కార్యాలయాల్లో పనిచేస్తున్న మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు(ఎంవీఐ), సహాయ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు (ఏఎంవీఐ) రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఓడీ విధానంలో విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏఎంవీఐలకు చెక్‌పోస్టుల వద్ద పోస్టింగ్‌

ఆరుగురికి ఎంవీఐలుగా పదోన్నతి

యాదాద్రి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి)/సూర్యాపేటరూరల్‌: రవాణా శాఖ ఆదాయం పెంపుకోసం రాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీలను ప్రభుత్వం కట్టుదిట్టం చేస్తోంది. అందులో భాగంగా వివిధ జిల్లా రవాణా శాఖ కార్యాలయాల్లో పనిచేస్తున్న మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు(ఎంవీఐ), సహాయ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు (ఏఎంవీఐ) రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఓడీ విధానంలో విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏఎంవీఐగా పనిచేస్తున్న శ్రీకాంత్‌, సూర్యాపేటలో పనిచేస్తున్న భాస్కర్‌రెడ్డి, కమల్‌కాంత్‌ను జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌కు, యాదాద్రిలో పనిచేస్తున్న రఘుబాబును నల్లగొండ జిల్లా వాడపల్లికి ఓడీ విధానంలో పోస్టింగ్‌ ఇస్తూ రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, సూర్యాపేట జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న నలుగురు ఏఎంవీఐలకు పదోన్నతి లభించింది. ఇమ్రాన్‌అహ్మద్‌ను యాదాద్రి భువనగిరికి, ఎం.రాములును నల్లగొండ జిల్లా వాడపల్లికి, నరేంద్రపాల్‌సింగ్‌, ఎం.కృష్ణారెడ్డిని కామారెడ్డి జిల్లాకు ఎంవీఐలుగా పదోన్నతి కల్పించారు. కోదాడ డివిజన్‌లో ఏఎంవీఐలుగా పనిచేస్తున్న ఆర్‌.బాబు, విరేంద్రనాయక్‌కు ఎంవీఐలుగా పదోన్నతిపొంది అక్కడే విధులు నిర్వహిస్తారు.

Updated Date - 2020-12-07T05:53:01+05:30 IST