మాకు తెలియకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారు ?

ABN , First Publish Date - 2020-09-12T09:58:33+05:30 IST

తమకు తెలియకుండా మండల సమావేశం ఎలా నిర్వహిస్తారని ఎంపీడీవో గీతను ఎంపీటీసీలు నవీన, నర్సింహులు, సుజాత

మాకు తెలియకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారు ?

వట్‌పల్లి ఎంపీడీవోను నిలదీసిన పలువురు ఎంపీటీసీలు


వట్‌పల్లి సెప్టెంబరు 11 : తమకు తెలియకుండా మండల సమావేశం ఎలా నిర్వహిస్తారని ఎంపీడీవో గీతను ఎంపీటీసీలు నవీన, నర్సింహులు, సుజాత తదితరులు నిలదీశా రు. షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం వట్‌పల్లి మండల సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉండగా ఎంపీడీవో పేరిట సభ్యులకు సమాచారాన్ని అందించారు. అయితే ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంతో పలువురు ఎంపీటీసీలకు ఎజెండా కాపీలు అందించకపోవడంతో పాటు సమావేశానికి ఆహ్వానం అందించలేదు. సభ్యులపై ఇంత నిర్లక్ష్యం చూపడంపై ఎంపీటీసీలు ఎంపీడీవోను దుయ్యబట్టారు. దీంతో కంగుతిన్న ఎంపీడీవో తమ సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలా జరిగింది తప్ప వేరే ఇతర కారణాలు లేవని బదులిచ్చారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని అన్నారు. అనంతరం సభను వాయిదా వేశారు.

Updated Date - 2020-09-12T09:58:33+05:30 IST