గ్రేటర్‌లో బీజేపీ గెలుపుతో శ్రేణుల సంబరాలు

ABN , First Publish Date - 2020-12-06T05:56:07+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో శనివారం జిల్లా కేంద్రంలోని రాందాస్‌ చౌరస్తాలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

గ్రేటర్‌లో బీజేపీ గెలుపుతో శ్రేణుల సంబరాలు
మెదక్‌లో బీజేపీ శ్రేణుల సంబరాలు

మెదక్‌ అర్బన్‌, డిసెంబరు 5: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో శనివారం జిల్లా కేంద్రంలోని రాందాస్‌ చౌరస్తాలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా గడ్డం శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్‌ నియంతృత్వ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనకు చరమగీతం పాడాలన్న కృతనిశ్చయంతో ప్రజలు ఉన్నారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు శశిధర్‌రెడ్డి అన్నారు.  ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే విషయం గ్రేటర్‌ ఎన్నికల్లో తేలిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్‌, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వీణ, సందీప్‌, సుబా్‌షగౌడ్‌, మండల అధ్యక్షుడు జనార్దన్‌, శివ, నిఖిల్‌, రాము, శ్రీనివాస్‌, ప్రసాద్‌, కాశీనాథ్‌, లోకేష్‌, రవీందర్‌, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

Read more