వైన్‌ షాపులో చోరీకి యత్నం

ABN , First Publish Date - 2020-12-21T05:15:25+05:30 IST

గుర్తు తెలియని దుండగులు వైన్‌ షాపులో చోరికి యత్నించిన సంఘటన హత్నూర మండలం దౌల్తాబాద్‌లో శనివారం రాత్రి చోటు చేసుకుంది.

వైన్‌ షాపులో చోరీకి యత్నం
దౌల్తాబాద్‌ గ్రామ శివారులోని వైన్స్‌ షెటర్‌ను ధ్వంసం చేసిన దృశ్యం

హత్నూర, డిసెంబరు 20: గుర్తు తెలియని దుండగులు వైన్‌ షాపులో చోరికి యత్నించిన సంఘటన హత్నూర మండలం దౌల్తాబాద్‌లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వైన్‌ షాపు నిర్వాహకులు, పోలీసుల కథనం ప్రకారం... గ్రామ శివారులోని భవానీ వైన్స్‌లో గుర్తు తెలియని దుండగులు చోరీ చేసేందుకు షటర్‌ను గునపాలతో లేపి చోరీకి యత్నించారు. ఆదివారం ఉదయం వైన్‌ షాపు షెటర్‌ పైకి ధ్వంసమై ఉండడంతో గమనించిన కొందరు నిర్వాహకులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మద్యం బాటిళ్లు, నగదు ఏమి చోరీ కాలేదని నిర్వాహకులు తెలిపారు. కాగా రెండు నెలల క్రితం ఇదే వైన్‌ షాపులో గుర్తు తెలియని దుండగులు వెనుక భాగంలో గోడకు కన్నం వేసి సుమారు రూ. లక్ష మద్యం బాటిళ్లతో పాటు కొంత నగదును దోచుకెళ్లారు. రెండు నెలలు గడవక ముందే తిరిగి అదే వైన్‌ షాపులో చోరీకి యత్నించంతో నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-12-21T05:15:25+05:30 IST