వీరభద్రస్వామి ఆలయంలో అఖండ బిల్వార్చన

ABN , First Publish Date - 2020-12-14T04:42:16+05:30 IST

సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్‌ ఎదురుగా ఉన్న వీరభద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయంలో ఆదివారం అఖండ బిల్వార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు.

వీరభద్రస్వామి ఆలయంలో అఖండ బిల్వార్చన
వీరభద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయంలో అఖండ బిల్వార్చన నిర్వహిస్తున్న భక్తులు

సంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 13  : సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్‌ ఎదురుగా ఉన్న వీరభద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయంలో ఆదివారం అఖండ బిల్వార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. 100 జంటలు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన కార్తీక భోజనాలలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు వెన్న చక్రేశ్వర్‌, సంగమ్వేర, పి.శి, మాటూరి మనోహర్‌, శివకుమార్‌, గోవు వీరన్న, వైద్యనాథ్‌, ప్రసాద్‌, ఆలయ ధర్మకర్త కరణం మల్లికార్జున అప్ప, నాగరాజు, గౌరవ అధ్యక్షుడు సంగుబాబు, అర్చకులు శివ, శివకాంత, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-14T04:42:16+05:30 IST