కరోనా ప్రభావంతో గ్రేటర్ పరిధిలో పలు మార్కెట్లు లాక్ డౌన్

ABN , First Publish Date - 2020-06-26T02:28:28+05:30 IST

కరోనా ప్రభావంతో గ్రేటర్ పరిధిలో పలు మార్కెట్లు లాక్ డౌన్

కరోనా ప్రభావంతో గ్రేటర్ పరిధిలో పలు మార్కెట్లు లాక్ డౌన్

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ తెలంగాణలో రోజురోజుకూ కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో పలు మార్కెట్లు లాక్ డౌన్ అయ్యాయి. ఆదివారం నుంచి 8 రోజులపాటు బేగంబజార్ లోని దుకాణాలను బంద్ చేస్తున్నట్లు కిరణా మర్చంట్ అసోసియేషన్ ప్రకటించింది. నేటి నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు సికింద్రాబాద్ జనరల్ బజార్, సూర్యా టవర్స్, ప్యారడైజ్ ప్రాంతాల్లోని అన్ని దుకాణాలు మూసి వేయనున్నారు. దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఆదివారం నుంచి మరి కొన్ని మార్కెట్లు బంద్ చేయనున్నట్లు అసోసియేషన్లు తెలిపాయి.

Updated Date - 2020-06-26T02:28:28+05:30 IST