ఉమామహేశ్వరున్ని దర్శించుకున్న ప్రభుత్వ విప్‌

ABN , First Publish Date - 2020-12-08T04:35:08+05:30 IST

కార్తీక సోమవారం కావడంతో ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులు ఉమామహేశ్వరున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

ఉమామహేశ్వరున్ని దర్శించుకున్న ప్రభుత్వ విప్‌
ఈశ్వరునికి క్షీరాభిషేకం చేస్తున్న ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు

అచ్చంపేట, డిసెంబరు 7: కార్తీక సోమవారం కావడంతో ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులు ఉమామహేశ్వరున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్‌ కందూరి సూధాకర్‌ వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి ఆరాధించారు. ఆలయంలో ఉత్సవ లింగానికి పాలు, తేనె, నెయ్యితో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి తమవంతు కృషి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే కోట్ల రూపాయలు మంజూరు చేయించి పర్యాటక సుందర ప్రాంతంగా తీర్చిదిద్దామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శాంతబాయి, సర్పంచ్‌ లోక్యానాయక్‌, నాయకుడు రాజేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-08T04:35:08+05:30 IST