సమ్మె విజయవంతం

ABN , First Publish Date - 2020-11-27T03:32:34+05:30 IST

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా అయిజలో ర్యాలీ నిర్వహించారు.

సమ్మె విజయవంతం
ప్రభుత్వాల తీరుకు నిరసనగా అయిజలో ద్విచక్ర వాహన ర్యాలీ

- అయిజలో ద్విచక్ర వాహన ర్యాలీ

అయిజ, నవంబరు 26: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా అయిజలో ర్యాలీ నిర్వహించారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయంటూ గురువారం భవన నిర్మాణ కార్మికులు కొత్తబస్టాండు నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. కార్మికుల వేతనాలు పెంచాలని, భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ తహసీల్దార్‌ యాదగిరికి వినతిపత్రం అందచేశారు. ఐఎఫ్‌టీయూ నాయకులు భాస్కర్‌, బజారి, దండోరా నా యకుడు ఆంజనేయులు, పౌరహక్కుల సంఘం నాయకులు విజయ్‌బాస్కర్‌రెడ్డి, ముక్కరన్న, ప్రేమరాజు, ఇసాకు, హరీష్‌ పాల్గొన్నారు.

 గద్వాల టౌన్‌: గద్వాల పట్టణంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూలతో పాటు టీఎస్‌ఆర్‌టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కార్మికులు ఆందో ళన నిర్వహించారు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసి స్తూ ప్రదర్శన జరిపారు.  

 గట్టు:  మండల కేంద్రమైన గట్టులో దేశ వ్యాప్త స మ్మెలో భాగంగా సీఐటీయూ, రైతు, హమాలీ, కార్మిక సంఘాలు, కేవీపీఎస్‌, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ముందు రైతు గ్రామీణ బంద్‌ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ సుబ్రమణ్యంకు వినతి పత్రం అంద చేశారు. కేవీపీఎస్‌ మండల కార్యద ర్శి కర్రెప్ప, ఆంజనేయులు, వీరేంద్ర, బాజరన్న, మునెప్ప తదితరులు పాల్గొన్నారు.

అలంపూర్‌: కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రభు త్వాలు కార్మికులకు న్యాయం చేకూర్చాలని డిమాండు చేస్తూ గురువారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఏఐటీ యూసీ, సీఐటీయూ కార్మికసంఘాల నాయకులు అలం పూర్‌ ఎంపీడీవో కార్యాలయం ముందు  నిరసనకు దిగారు. ఈ సమ్మెలో సీపీఐ నాయకులు పెదబాబు, అంగన్‌వాడీ, ఆశాలు ఉన్నారు. 

ఉండవల్లి:  ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం ఉండవల్లిలో కార్మిక సంఘాల నాయకులు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఏం మండల కార్యదర్శి మద్దిలేటి మా ట్లాడారు. అనంతరం కార్మిక నాయకులు ర్యాలీగా వెళ్లి తహసీల్దారు లక్ష్మికి వినతిపత్రం అందజేశారు.  మండ ల కార్యదర్శి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఇటిక్యాల: దేశవ్యాప్తంగా చేపడుతున్న సమ్మెతో ప్ర భుత్వాలు కార్మికులకు న్యాయం చేకూర్చాలని వ్యవ సాయకార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి దేవదాసు అన్నారు.  సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి తహసీల్దార్‌ శివలింగంకు వినతిపత్రం అందజే శారు.  కేవీపీఎస్‌ నాయకులు ప్రవీణ్‌కుమార్‌, సరస్వతి, శివశంకర్‌, అంగన్‌వాడీ, ఆశాలు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-27T03:32:34+05:30 IST