కట్టడి ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-07-27T17:59:03+05:30 IST

కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమ త్తంగా ఉండాలని, కట్టడి ప్రాంతాల్లో ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూర్చాలని

కట్టడి ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్‌

మహబూబ్‌నగర్‌: కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమ త్తంగా ఉండాలని, కట్టడి ప్రాంతాల్లో ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూర్చాలని కలెక్టర్‌ వెంకట్రావ్‌ అన్నారు. ఆదివారం ఆయన పట్టణంలోని గణేష్‌నగర్‌ కట్టడి ప్రాంతంలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. వైద్యసేవలు, పారిశుధ్య నిర్వహణ గురించి ఆరా తీశారు. కట్టడి ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలతో మాట్లాడిన ఆయన వైద్యసేవలు అందుతున్నాయా.. ఏమైనా సమస్య లు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనవసరంగా బయట తిరగొద్దని సూచించారు. కలెక్టర్‌ వెంట కౌన్సిలర్‌ సంధ్య ఉన్నారు. 

Updated Date - 2020-07-27T17:59:03+05:30 IST