బైక్‌ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2020-11-26T03:17:15+05:30 IST

సీఐటీయూ, ఇప్ట్యూ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్‌ ర్యాలీని బుధవారం జిల్లా కేంద్రంలో ఎస్‌ఐ చంద్రమోహన్‌, పోలీసులు అడ్డుకొని నాయకులను అరెస్టుచేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

బైక్‌ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
నాయకులను అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు

నారాయణపేట, నవంబరు 25: సీఐటీయూ, ఇప్ట్యూ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్‌ ర్యాలీని బుధవారం జిల్లా కేంద్రంలో ఎస్‌ఐ చంద్రమోహన్‌, పోలీసులు అడ్డుకొని నాయకులను అరెస్టుచేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకట్రామిరెడ్డి, బాల్‌రామ్‌, ఇప్ట్యూ నరసింహా, వ్యవసాయ కార్మిక సంఘం గోపాల్‌లు అంబేద్కర్‌ చౌరస్తాలో నిరసన వ్యక్తంచేసి మాట్లాడారు.  గురువారం జరిగే సార్వత్రిక సమ్మెను విజయ వంతం చేయాలని దేశ వ్యాప్తంగా బైక్‌ ర్యాలీలు చేపట్టగా జిల్లా కేంద్రంలో పోలీసులు అడ్డుకోవడం విడ్డూర మన్నారు. అక్రమ అరెస్టులను ప్రజాస్వామిక వాదులు ఖండించాలని కోరారు. 


Read more