భూసారాన్ని కాపాడుకోవాలి

ABN , First Publish Date - 2020-12-06T04:15:16+05:30 IST

రైతులు భూసారాన్ని కాపాడుకోవాలని వ్యవసాయశాఖ జిల్లా ఇన్‌చార్జి అధికారి బి.వెంకటేష్‌ అన్నారు.

భూసారాన్ని కాపాడుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న అధికారి

 వ్యవసాయ శాఖ జిల్లా 

    ఇన్‌చార్జి అధికారి వెంకటేష్‌  

 ఘనంగా ప్రపంచ మృత్తిక దినోత్సవం

పాలమూరు, డిసెంబరు 5: రైతులు భూసారాన్ని కాపాడుకోవాలని వ్యవసాయశాఖ జిల్లా ఇన్‌చార్జి అధికారి బి.వెంకటేష్‌ అన్నారు. శనివారం జిల్లా స మీపంలోని ఎదిర గ్రామంలో ప్రపంచ మృత్తిక దినో త్సవాన్ని వ్యవసాయశాఖ, ఏరువాక కేంద్రం ఆధ్వ ర్యంలో ఘనంగా నిర్వహించారు. సమావేశంలో అ ధికారులు మాట్లాడుతూ వ్యవసాయం మనుగడకు భూమి ప్రాముఖ్యతను వివరించారు. నేలలో సారం కాపాడుకునేందుకు సేంద్రియఎరువు(పశువులు, వా న పాములఎరువు)లు అధిక మోతాదులో వేయా ల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. పచ్చిరొట్ట ఎరు వు(జీలుగ, జనుము)ను పెంచి కలియ దున్నడంతో భూమి ఎంతో సారవంతమవుతుందన్నారు. శాస్త్రవేత్త డాక్టర్‌ రాజ మణి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌ యాదవ్‌, కౌన్సిలర్‌ యాద మ్మ, రామాంజనేయులు, ఎంఏవో శ్యాంయాదవ్‌, సునీత, భవాని, శ్రీనాథ్‌శర్మ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T04:15:16+05:30 IST