పేదల ఆశాజ్యోతి అంబేడ్కర్‌

ABN , First Publish Date - 2020-12-07T04:23:57+05:30 IST

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతిని జిల్లా అంతటా జరుపుకున్నారు. దళిత, ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.

పేదల ఆశాజ్యోతి అంబేడ్కర్‌
ఎమ్మెల్యే అథితి గృహంలో అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళ్లు అర్పిస్తున్న మార్కెట్‌ చైర్మన్‌రాజేష్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు

జిల్లా అంతటా రాజ్యాంగ నిర్మాత వర్ధంతి 


నారాయణపేట టౌన్‌/ నారాయణపేటరూరల్‌/ దామరగిద్ద/ కోస్గి/ ధన్వాడ/ మాగనూర్‌/ కృష్ణ/ మక్తల్‌ రూరల్‌/ మద్దూర్‌/ మరికల్‌/ ఊట్కూర్‌, డిసెంబరు 6 : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతిని జిల్లా అంతటా జరుపుకున్నారు. దళిత, ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.

పేటలో తపస్‌ రాష్ట్ర నాయకులు బాలరాజు, జిల్లా అధ్యక్షుడు శేర్‌ కృష్ణారెడ్డి, నరసింహ, సీతారాములు, శ్రీనివాస్‌రెడ్డి, భీంరెడ్డి, రవికుమార్‌, నర్సింహులు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. లక్ష్మీపూర్‌ కార్యక్రమంలో సర్పంచ్‌ రామ్మోహన్‌, ఎంపీటీసీ బాలమణి, బాలరాజు,సాయిలు, నరసింహ, భాస్కర్‌ పాల్గొన్నారు.

దామరగిద్ద మండలంలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్‌, అంబేడ్కర్‌ యువజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో శనివారం అంబేడ్కర్‌ వర్ధంతి వేడుకలను జరుపుకున్నారు. ఆయా సంఘాల నాయకులు అంజిలయ్యగౌడ్‌, గోపాల్‌, ఎంపీపీ నర్సప్ప, జడ్పీటీసీ లావణ్యరాములు, హన్మంతు, ముస్తాపేట్‌ సర్పంచ్‌ లాలప్ప, హన్మంతు, మోహన్‌ ఉన్నారు. 

కోస్గిలో స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. కోస్గి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మ్యాకల శిరీష, ఎంపీపీ మధుకర్‌రావు, కౌన్సిలర్లు మాస్టర్‌ శ్రీనివాస్‌, జనార్ధన్‌రెడ్డి, బాలేష్‌, లింగంలక్ష్మి, బందెప్ప, కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ నషీర్‌, అమృతమ్మ, నాయకులు మ్యాకల రాజేష్‌, కొడిగంటి హరికుమార్‌, రాస్నం బాలరాజు, జగదీశ్వర్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, భీంరెడ్డి, హన్మంత్‌, వెంకట్‌ నర్సిములు, ఎమ్మార్పీఎస్‌ నాయకులు బ్యాగరి రాములు తదితరులు ఉన్నారు.

ధన్వాడ, కిష్టాపూర్‌ గ్రామాల్లో అదివారం అంబేడ్కర్‌ వర్ధంతిని టీఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. టీఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి కుందేటి వెంకటయ్య, జిల్లా ఉపాధ్యక్షులు గండి బాలరాజు, మురళీధర్‌రెడ్డి, కిష్టయ్య, ఊసు రవి కుమార్‌ నీరటి నర్సింములు నాయుడు, బోయ బాలరాజు, ఉప సర్పంచ్‌ యూసుఫ్‌అలీ, ఎంపీటీసీ మాధవి, కిష్టాపూర్‌ సర్పంచ్‌ చిట్టెం దామోదర్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. 

మాగనూర్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి ఎంపీపీ శ్యామలమ్మ పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. అంబేడ్కర్‌ యువసన సంఘం నాయకులు, సర్పంచ్‌ రాజు, చెన్నప్ప, వెంకటయ్య, కతలప్ప, వెంకటపతి, మాజీ ఉప సర్పంచ్‌  నర్సింములు, ఉప సర్పంచ్‌ సుధ నివాళి అర్పించార.

కృష్ణ మండలం గుడేబల్లూర్‌ గ్రామ శివారులోని టై రోడ్డు వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్ళు అర్పించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు మౌనేష్‌, ఎంపీటీసీ రామచంద్ర, నాగప్ప, ఆంజనేయులు, బీజేపీ నాయకులు ఎంపీటీసీ వెంకటేశ్‌, అంబేడ్కర్‌ సంఘం నాయకులు పూలమాలలు వేసిన వారిలో ఉన్నారు. 

మక్తల్‌ పట్టణంలోని ఎమ్మెల్యే నివాస గృహంలో మార్కెట్‌ చైర్మన్‌ రాజేష్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అలాగే బీఎస్పీ, అంబేడ్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలోనూ నివాళి అర్పించారు. మాద్వార్‌లో దళిత్‌ శక్తి ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ గాయత్రి అనిల్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, అధికార ప్రతినిధి రామలింగం, రాజమహేందర్‌రెడ్డి, మారుతి, నేతాజీరెడ్డి,  బీఎస్పీ, అంబేడ్కర్‌ సంఘం నాయకులు అర్జున్‌రాజ్‌, తిమ్మప్ప ముదిరాజ్‌, సుజాత, మారెప్ప, విజయ్‌, సాగర్‌, హర్షప్ప, నర్సిములు, చిన్న హన్మంతు, దత్తాత్రేయ, దళితశక్తి ప్రోగ్రామ్‌ నాయకులు నాగేష్‌, బాలరాజు, రాజు పాల్గొన్నారు. 

మద్దూర్‌, నాగిరెడ్డిపల్లి, దోరేపల్లి, భూనీడ్‌ తదితర గ్రామాల్లో నాయకులు, వివిధ సంఘాల సభ్యులు అంబేడ్కర్‌కు ఘన నివాళ్లర్పించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ రఘుపతిరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, యువజన సంఘాల సభ్యులు అరుణ, వెంకటేశ్‌, వెంకటయ్య, సంజీవ్‌, నర్సిములు, చెంద్రప్ప, కృష్ణ, మూర్తి, అశోక్‌,  హన్మప్ప, దాసు పాల్గొన్నారు

మరికల్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి గ్రామ సర్పంచ్‌ గోవర్ధన్‌, పీఆర్‌టీయూ సభ్యులు, దళితులు, భూసంరక్షణ సమితి సభ్యులు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రవికుమార్‌, మాజీ సర్పంచ్‌ లక్ష్మీరామస్వామి, బాలకృష్ణ పీఆర్‌టీయూ జిల్లా అఽధ్యక్షుడు తిమ్మారెడ్డి, వెంకటేశ్వర్లు, రాజమల్లేష్‌, భీమరాజు, మల్లయ్య, లక్ష్మయ్య, చిన్నప్ప పాల్గొన్నారు.Read more