అహ్మద్‌ పటేల్‌ మృతి తీరని లోటు

ABN , First Publish Date - 2020-11-26T02:53:02+05:30 IST

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతి కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటు అని పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

అహ్మద్‌ పటేల్‌ మృతి తీరని లోటు

 పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్‌ 

వనపర్తి అర్బన్‌, నవంబరు 25: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతి కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటు అని పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బుధవారం ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా అహ్మద్‌ పటేల్‌ సుదీర్ఘకాలం సో నియాగాంధీ రాజకీయ సలహాదారుడిగా వ్యవహరించారని తెలిపారు. నాయ కులు తిరుపతయ్య, రాగివేణు, ద్వారపోగు వెంకటేష్‌, శంకర్‌నాయక్‌,  అక్తర్‌, అ నీష్‌, రాధాకృష్ణ, బాబా, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

Read more