నర్సింగ్‌ సేవలు వెలకట్టలేనివి

ABN , First Publish Date - 2020-05-13T06:38:18+05:30 IST

మాతా శిశు సంరక్షణ, అత్యవసర రోగులకు వైద్యసేవలు, కరోనా కట్టడి.. ఇలా జిల్లాలో నర్సింగ్‌ ఉద్యోగులు ఆదర్శవంతమైన

నర్సింగ్‌ సేవలు వెలకట్టలేనివి

జిల్లా ఆసుపత్రి సూపరింటెండ్‌ వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో శ్రీనివాసరావు


ఖమ్మం సంక్షేమవిభాగం, మే 12: మాతా శిశు సంరక్షణ, అత్యవసర రోగులకు వైద్యసేవలు, కరోనా కట్టడి.. ఇలా  జిల్లాలో నర్సింగ్‌ ఉద్యోగులు ఆదర్శవంతమైన వైద్యసేవలు అందిస్తున్నారని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ బి. వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో బొల్లికొండ శ్రీనివాసరావు కొనియాడారు. నైటింగేల్‌ జయంతి సందర్భంగా జిల్లా ఆసుపత్రిలో నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ బి. సుగుణ అధ్వర్యంలో హెడ్‌నర్సులు, స్టాఫ్‌నర్సులు భౌతికదూరం పాటిస్తు కొవ్వొత్తులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా నర్సింగ్‌ ప్రతిజ్ఞ చేశారు.


అనంతరం నైటింగేల్‌ జీవితంలో రోగులు అందించిన వైద్యసేవలపై వివరించారు. ప్రతీనర్సింగ్‌ ఉద్యోగి జీవితంలో ఈ సంవత్సరం వ్యాప్తి చెందిన కరోనా వైర్‌సకు అందించిన వైద్యసేవలు మరవలేనివని అన్నారు. వైద్యసేవలు అందించిన ఉద్యోగులు వృత్తిపరమైన సంతృప్తి కలుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్‌నర్సులు రాజరాజేశ్వరీ, అంతోనమ్మ, లిల్లీ ప్రకాశ్‌రాణి, కె. విజయలక్ష్మి, సునీత, ఎమీల్యేమేరీ, సూర్యపోగు మేరీ, విక్టోరియా రాణి, రాధాకృష్ణ, జి. లక్ష్మి, ఫ్లారెన్స్‌పద్మశ్రీ, చంద్రభగీరదీదేవి, వి. శ్యామల, ఎ. నాగేంద్రమ్మ, వరకుమారి, ఇందిర, జి. ఇందిరాదేవి, పి. మల్లేశ్వరీ, నీరజారాణి, జె. పుష్పా, ఎన్‌. రాజేశ్వరీ, స్టాపునర్సులు పాల్గొన్నారు. కరోనా వార్డులో వైద్యసేవలు అందించిన హెడ్‌నర్సులు, స్టాఫ్‌నర్సులకు సన్మానంచేశారు. 

Updated Date - 2020-05-13T06:38:18+05:30 IST