బీజేపీ ఆధ్వర్యంలో రోడ్డుపై నాట్లు వేసి నిరసన

ABN , First Publish Date - 2020-08-20T11:08:35+05:30 IST

వెంకట్రావుపల్లె రోడ్డు మరమ్మతు చేపట్టాలని బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు

బీజేపీ ఆధ్వర్యంలో రోడ్డుపై నాట్లు వేసి నిరసన

ఇల్లంతకుంట, ఆగస్టు 19: వెంకట్రావుపల్లె రోడ్డు మరమ్మతు చేపట్టాలని బీజేపీ  ఆధ్వర్యంలో బుధవారం రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ వెంకట్రావుపల్లె రోడ్డు దెబ్బతిని ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.  అనేక సార్లు ఉద్యమించినా స్పందించక పోవడం దురదృష్టకరమన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్‌, నాయకులు అనగోని అవినాష్‌, మధుసూదన్‌రెడ్డి, రామ్‌సాగర్‌, శ్రీకాంత్‌, సతీష్‌, అనీల్‌, సంపత్‌, చంద్రం, మొండయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Read more