రాష్ట్రాలకు అన్యాయం: ఎంపీ కేశవరావు

ABN , First Publish Date - 2020-03-24T11:19:20+05:30 IST

కేంద్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ర్టాలకు ఒక శాతం నిధులను కోతపెట్టి అన్యాయం చే సిందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కె.కేశవరావు అన్నారు.

రాష్ట్రాలకు అన్యాయం: ఎంపీ కేశవరావు

న్యూఢిల్లీ, మార్చి23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ర్టాలకు ఒక శాతం నిధులను కోతపెట్టి అన్యాయం చే సిందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కె.కేశవరావు అన్నారు. రాజ్యసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై సోమవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌ నుంచి రాష్ర్టాలకు న్యాయపరంగా రావలసిన 42 శాతం నిధులకు బదులు ఈసారి 41 శాతమే  కేటాయించడం బాధాకరమన్నారు.  కాగా, కరోనా కారణంగా రాజ్యసభ సమావేశాలను వాయిదా వేయాలని కోరుతూ కేశవరావు రాజ్యసభ చైౖర్మన్‌ వెంకయ్య నాయుడుకు వాయిదా తీర్మానం నోటీస్‌ ఇచ్చారు. అయితే ఉభయ సభలను వాయిదా వేయాలని  కేంద్రం ముందుగానే నిర్ణయించినందున ఆ తీర్మానాన్ని అనుమతించలేదు. 

Updated Date - 2020-03-24T11:19:20+05:30 IST