నేను సైతం జాతి ఐక్యతకు జ్యోతినై..

ABN , First Publish Date - 2020-04-05T08:56:47+05:30 IST

ముంగిళ్లలో, బాల్కనీల్లో ప్రమిదలు పేర్చి నూనెపోసి, వత్తులేసి దీపాలు వెలిగించి.. కరోనా వైరస్‌ అనే చీకటిని తరిమికొట్టే సంకల్పంలో జాతి ఐక్యంగా ఉందనేది చాటిచెప్పేందుకు రాష్ట్ర ప్రజానీకం...

నేను సైతం జాతి ఐక్యతకు జ్యోతినై..

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ముంగిళ్లలో, బాల్కనీల్లో ప్రమిదలు పేర్చి నూనెపోసి, వత్తులేసి దీపాలు వెలిగించి.. కరోనా వైరస్‌ అనే చీకటిని తరిమికొట్టే సంకల్పంలో జాతి ఐక్యంగా ఉందనేది చాటిచెప్పేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధమైంది. ఆదివారం రాత్రి సరిగ్గా 9 గంటలకు ఇళ్లలో లైట్లను ఆర్పేసి.. దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు, సెల్‌ఫోన్‌ ఫ్లాష్‌లైట్లు ఏది వీలైతే అది వెలిగించి 9 నిమిషాల పాటు ప్రభలను కొనసాగించాలన్న ప్రధాని మోదీ పిలుపును పాటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అత్యవసర సేవలందిస్తున్నవారికి మరోసారి సంఘీభావం తెలపాలని రాష్ట్ర ప్రజలను బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్‌,  కోరారు. ఉద్యోగ, గెజిటెట్‌ అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు ఆదివారం రాత్రి 9గంటలకు జ్యోతులు వెలిగించాలని ఉద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది.

Updated Date - 2020-04-05T08:56:47+05:30 IST