సైనికుల సేవలు చిరస్మరణీయం : బ్రిగేడియర్‌ అభిజిత్‌ చంద్ర

ABN , First Publish Date - 2020-07-27T10:16:45+05:30 IST

21వ కార్గిల్‌ విజయ్‌ దివస్‌ కార్యక్రమాన్ని తెలంగాణ ఆంధ్ర సబేరియా ఆధ్వర్యంలో ఏవోసీ సెంటర్‌, మిలటరీ సైనిక్‌ హాస్పిటల్‌,

సైనికుల సేవలు చిరస్మరణీయం : బ్రిగేడియర్‌ అభిజిత్‌ చంద్ర

అల్వాల్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): 21వ కార్గిల్‌ విజయ్‌ దివస్‌ కార్యక్రమాన్ని తెలంగాణ ఆంధ్ర సబేరియా ఆధ్వర్యంలో ఏవోసీ సెంటర్‌, మిలటరీ సైనిక్‌ హాస్పిటల్‌, సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించారు. డిప్యూటీ జీవోసీ బ్రిగేడియర్‌ అభిజిత్‌ చంద్ర ముఖ్యఅతిథిగా పాల్గొని అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రక్షణ కు సైనికులు అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. కార్గిల్‌ యుద్ధంలో విజయం సాధించిన సందర్భంగా ప్రతియేటా విజయ్‌ దివస్‌ నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. 


మాజీ సైనికుల ఆధ్వర్యంలో.. 

తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రంగయ్యగౌడ్‌ ఆధ్వర్యంలో అల్వాల్‌లోని సంఘం కార్యాలయంలో కార్గిల్‌ విజయ్‌ దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజిక దూరం పాటిస్తూ అమరులైన వీర జవాన్‌లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ సైనికులు శ్రీనివాస్‌, బాబు, రవి, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-27T10:16:45+05:30 IST