జల్‌పల్లిలో పర్యటించిన మంత్రి సబిత

ABN , First Publish Date - 2020-04-07T09:29:51+05:30 IST

బాలాపూర్‌ రాయల్‌కాలనీ గ్రీన్‌సిటీలో రెండు, కొత్తపేట్‌లో ఒకటి, పహడీషరీ్‌పలో నాలుగు కరోనా

జల్‌పల్లిలో పర్యటించిన మంత్రి సబిత

పహడీషరీప్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): బాలాపూర్‌ రాయల్‌కాలనీ గ్రీన్‌సిటీలో రెండు, కొత్తపేట్‌లో ఒకటి, పహడీషరీ్‌పలో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయని తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ ఆదివారం మున్సిపాల్టీ పరిధిలోని షాహీన్‌నగర్‌, అలైన్‌ కాలనీల్లో పర్యటించారు. వైరస్‌ నివారణ కోసం తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించారు. కందుకూరు ఆర్డీవో రవీందర్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివా్‌సరెడ్డి, జల్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌ అహ్మద్‌ షఫీయుల్లా దగ్గరుండి వైరస్‌ నివారణ కోసం తీసుకుంటున్న జాగ్రత్తలను పర్యవేక్షిస్తున్నారు.

Read more