అభిమానికి మెగా సాయం

ABN , First Publish Date - 2020-04-12T09:34:19+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి సహాయంతో ఆయన అభిమాని రాజనాల నాగలక్ష్మి గుండె ఆపరేషన్‌ శనివారం విజయవంతంగా పూర్తయింది.

అభిమానికి మెగా సాయం

అభిమానికి గుండె ఆపరేషన్‌ విజయవంతం


హైదరాబాద్‌ ఏప్రిల్‌11 (ఆంధ్రజ్యోతి): మెగాస్టార్‌ చిరంజీవి సహాయంతో ఆయన అభిమాని రాజనాల నాగలక్ష్మి గుండె ఆపరేషన్‌ శనివారం విజయవంతంగా పూర్తయింది. సుమారు 3.30 నిమిషాల సమయం ఆపరేషన్‌కు పట్టిందని స్టార్‌ హాస్పిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.ఎమ్‌. గోపీచంద్‌ తెలిపారని, ఈ విషయం పై చిరంజీవి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటూనే ఉన్నారని అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు తెలిపారు.


ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘‘విజయవంతంగా రాజనాల నాగలక్ష్మికి సర్జరీ చేసిన డాక్టర్ల బృందానికి కృతజ్ఞతలు. ఆమె అనారోగ్య విషయాన్ని సరైన సమయానికి నా దృష్టికి తీసుకొచ్చిన స్వామి నాయుడికి, అనారోగ్య సమస్యతో ఇబ్బందితో ఉన్న ఆమెను గుంటూరు నుంచి హైదరాబాద్‌ వరకూ రావడానికి ఏర్పాట్లు చేసిన బి.దిలీ్‌పకి, ప్రయాణించడానికి అనుమతిచ్చిన రెండు రాష్ర్టాల పోలీసు అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నా’’ అని అన్నారు. 

Updated Date - 2020-04-12T09:34:19+05:30 IST