క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు

ABN , First Publish Date - 2020-10-31T08:01:09+05:30 IST

ఐపీఎల్‌ సీజన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఎస్సార్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుం చి నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు

క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు

అమీర్‌పేట, అక్టోబర్‌ 30(ఆంధ్రజ్యోతి): ఐపీఎల్‌ సీజన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఎస్సార్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుం చి నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీఐ సైదులు తెలిపిన ప్రకారం.. బోరబండకు చెందిన దుర్గాప్రసాద్‌ స్థానిక సాయిబాబా ఆలయం సమీపంలో లేట్‌ మిషన్‌ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కొంతకాలంగా ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగులు నిర్వహిస్తున్నాడు. నేరుగా లేదా తన ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్న క్రికెట్‌ ఎక్ఛ్సేంజ్‌, క్రికెట్‌లైన్‌ మజా 11 అనే యాప్‌ల ద్వారా ఐపీఎల్‌ మ్యాచ్‌లకు సంబంధించి క్రికెట్‌ బెట్టింగులు నిర్వహిస్తుండేవాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసి అతడి నుంచి సెల్‌ఫోన్‌తో పాటు నాలుగు డైరీలు, రూ. 18,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.

Read more