విదేశాల నుంచి వచ్చిన వారికి స్థానికుల బెదిరింపులు?

ABN , First Publish Date - 2020-04-12T09:34:59+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో విదేశాల నుంచి వచ్చిన వారిని స్థానిక బస్తీ వాసులు కొందరు వారిని తమ ప్రాంతాల నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నట్లు తెలిసింది.

విదేశాల నుంచి వచ్చిన వారికి   స్థానికుల బెదిరింపులు?

చిక్కడపల్లి, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో విదేశాల నుంచి వచ్చిన వారిని స్థానిక బస్తీ వాసులు కొందరు వారిని తమ ప్రాంతాల నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నట్లు తెలిసింది. చిక్కడపల్లి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఇటీవల కొందరు వ్యక్తులు విదేశాల నుంచి తిరిగి వచ్చారు. వారికి ఎయిర్‌పోర్ట్‌లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని నిర్ధారణ అయ్యాక ఇళ్లకు పంపించారు.


విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు స్వీయ క్వారంటైన్‌లో ఉంటున్నప్పటికీ స్థానికంగా ఉంటున్న కొన్ని అపార్ట్‌మెంట్‌వాసులు, స్థానికులు వారిని తమ ప్రాంతాల నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో విదేశాల నుంచి వచ్చిన వారిలో కొందరు స్వీయ క్వారంటైన్‌లో ఉండడం లేదని బయట తిరుగుతున్నారని పోలీసులకు, స్థానిక కార్పొరేటర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు విదేశాల నుంచి వచ్చిన వారి ఇండ్లకు వెళ్లి వారిని బయటకు రావద్దని స్వీయ క్వారంటైన్‌లో ఉండాలని కోరారు. క్వారంటైన్‌ను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు  హెచ్చరించినట్లు తెలిసింది. 

Updated Date - 2020-04-12T09:34:59+05:30 IST