అద్భుత నగరం హైదరాబాద్‌

ABN , First Publish Date - 2020-09-16T10:04:50+05:30 IST

విభిన్న మతాలు, జాతుల కలయికతో వర్ధిల్లుతున్న నగరంగా హైదరాబాద్‌ మరో ఖ్యాతిని సొంతం చేసుకుంది.

అద్భుత నగరం హైదరాబాద్‌

అనుకూలమైన నివాసాలు, ఉపాధి అవకాశాలు

హాలిడిఫై.కామ్‌ సర్వేలో దేశంలోనే ప్రథమ స్థానం


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): విభిన్న మతాలు, జాతుల కలయికతో వర్ధిల్లుతున్న నగరంగా హైదరాబాద్‌ మరో ఖ్యాతిని సొంతం చేసుకుంది. దేశంలోని ప్రఖ్యాతిగాంచిన 34 ఉత్తమ నగరాల్లో భాగ్యనగరం ముందువరుసలో నిలిచింది. డెస్టినేషన్‌ డిస్కవరీ వెబ్‌సైట్‌ అయిన హాలిడిఫై.కామ్‌ చేసిన సర్వేలో దేశంలోనే ఎక్కువ మంది నివసించేందుకు, పనిచేసేందుకు అత్యుత్తమ ప్రదేశంగా హైదరాబాద్‌ గుర్తింపు పొందింది.


ఆయా నగరాల్లో పర్యాటక ప్రాంతాలు, భాషలు, సంస్కృతులతోపాటు ఉపాధి అవకాశాలు, రవాణా, వసతి సదుపాయాలు, వేగవంతమైన, సుందరమైన అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై ఈ సర్వే చేశారు. ఇందులో మొత్తం 5 పాయింట్లకుగాను హైదరాబాద్‌ అత్యధికంగా 4.0 స్కోరు సాధించింది. ఈ క్రమంలో ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై వంటి నగరాలను వెనక్కి నెట్టింది. కాగా, హైదరాబాద్‌లోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రతి ఏడాది సెప్టెంబరు నుంచి మార్చి వరకు అనుకూలమైన సమయంగా ఈ వెబ్‌సైట్‌ పేర్కొంది. నగరంలో ఎన్నో చూడదగిన ప్రదేశాలున్నాయని తెలిపింది.

Updated Date - 2020-09-16T10:04:50+05:30 IST