కొమ్రంభీం జిల్లాలో ఎన్‌కౌంటర్.. తప్పించుకున్న భాస్కర్

ABN , First Publish Date - 2020-09-20T16:55:30+05:30 IST

అసిఫాబాద్ జిల్లాలో ఎన్ కౌంటర్ కలకలం రేపుతోంది.

కొమ్రంభీం జిల్లాలో ఎన్‌కౌంటర్.. తప్పించుకున్న భాస్కర్

కొమ్రంభీం: అసిఫాబాద్ జిల్లాలో ఎన్ కౌంటర్ కలకలం రేపుతోంది. అక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత భాస్కర్ తప్పించుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం భాస్కర్ లక్ష్యంగా కూంబింగ్ కొనసాగుతోంది. కాగజ్‌నగర్ మండలం, ఈజ్‌గామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కడంబ అడవుల్లో కూంబింగ్ నిర్వహించిన పోలీసులకు మావోయిస్టులు తారసబడ్డారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మరో ముగ్గురు తప్పించుకున్నట్లు సమాచారం.


మృతుల్లో ఛత్తిస్‌గడ్‌కు చెందిన కోయా జంగు.. అలియాస్ వర్గీస్, నిర్మల్ జిల్లా కడెంకు చెందిన కంచి లింగవ్వ ఉన్నట్లుగా సమాచారం. ఘటనా స్థలంలో రెండు ఏకె47 తుపాకులతోపాటు  మావోయిస్టుల సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భాస్కర్‌ను పట్టుకుతీరుతామని పోలీసులు చెబుతున్నారు. భాస్కర్ దళం కోసం మూడు నెలలుగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో పోలీసుల ఆపరేషన్ కొనసాగుతోంది.

Updated Date - 2020-09-20T16:55:30+05:30 IST