ముష్క్ మహల్ ప్రాంతంలో కుళ్ళిపోయిన స్థితిలో మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2020-10-19T16:39:24+05:30 IST

రంగారెడ్డి: మొన్న కురిసిన వర్షాలకు హైదరాబాద్‌లో వరద పోటెత్తిన విషయం తెలిసిందే.

ముష్క్ మహల్ ప్రాంతంలో కుళ్ళిపోయిన స్థితిలో మృతదేహం లభ్యం

రంగారెడ్డి: మొన్న కురిసిన వర్షాలకు హైదరాబాద్‌లో వరద పోటెత్తిన విషయం తెలిసిందే. దాదాపు అన్ని ఏరియాలనూ వరద ముంచెత్తింది. దీంతో చాలా మంది వరదలో కొట్టుకుపోయారు. తాజాగా రాజేంద్రనగర్ పీఎస్ పరిధి అత్తాపూర్ ముష్క్ మహల్ ప్రాంతంలో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Updated Date - 2020-10-19T16:39:24+05:30 IST