‘హోం ఐసోలేషన్‌’ వ్యర్థాల సేకరణలో జాగ్రత్త!

ABN , First Publish Date - 2020-07-08T08:11:44+05:30 IST

‘హోం ఐసోలేషన్‌’ వ్యర్థాల సేకరణలో జాగ్రత్త!

‘హోం ఐసోలేషన్‌’ వ్యర్థాల సేకరణలో జాగ్రత్త!

వ్యర్థాల తరలింపులో అలసత్వం వద్దు: సీపీసీబీ


హైదరాబాద్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా రోగుల వ్యర్థాల సేకరణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) సూచించింది. రోజూ వారు వినియోగించిన వస్తువుల వ్యర్థాలను సేకరించాలని, వ్యర్థాల తరలింపులో నిర్లక్ష్యం వద్దని హెచ్చరించింది. ఎలాంటి లక్షణాలు లేని, తక్కువ లక్షణాలున్న కరోనా రోగులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హోం ఐసోలేషన్‌ జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోం ఐసోలేషన్‌ వ్యర్థాల సేకరణపై సీపీసీబీ మార్గదర్శకాలు విడుదల చేసింది. వ్యర్థాల సేకరణ, తరలింపు సమయంలో పారిశుధ్య కార్మికులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మార్గదర్శకాలను మునిసిపాలిటీలు, గ్రామపంచాయతీలు సరిగా అమలు చేసేలా చూడాలని రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లను ఆదేశించింది. 


వాడిన గాగుల్స్‌, ఫేస్‌షీల్డ్‌, తుంపర్ల నుంచి రక్షించే ఆప్రాన్‌, ప్లాస్టిక్‌ కవరాల్‌, హాజ్మెట్‌ సూట్‌, నైట్రిల్‌ గ్లౌజ్‌ తదితర రక్షణ సామాగ్రిని జాగ్రత్తగా తరలించాలి.


కరోనా రోగులు మరుగు దొడ్లను వినియోగించుకున్న తర్వాత 0.5ు క్లోరిన్‌ నీటితో శుభ్రపరచాలని చెప్పాలి. 


వ్యర్థాల తరలింపు బాధ్యతను ఆరోగ్యకరమైన వ్యక్తులకు అప్పగించాలి. వారికి  కరోనా పరీక్షలు చేయాలి. ఒక్కసారి వాడిన మాస్కులను తిరిగి వాడకుండా ముక్కలుగా కత్తిరించాలి; వంట గది వ్యర్థాలు, నిత్యావరసర సరుకుల కవర్లు, ఆహార పదార్థాలు, వేస్ట్‌ పేపర్లు, ప్లాస్టిక్‌, ఉడ్చిన దుమ్మును సేకరించి  తరలించాలి.  తర్వాత రసాయనాలతో ఇళ్లంతా పిచికారి చేయాలి. 


వ్యర్థాలను సేకరించే పారిశుధ్య ఉద్యోగులకు అవగాహన కల్పించాలి. పీపీఈ కిట్లు, ఇతర రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచాలి. 


రోగులు తిన్న ఆహారం, ప్లేట్లు, మాస్కులు, జీవవ్యర్థాలుగా మారే ప్రమాదముంది. వాటిని రోజూ సేకరించి తరలించాలి. 


హోం ఐసోలేషన్‌లోని వ్యర్థాలను తొలగించకపోతే స్థానిక మునిసిపల్‌ అఽధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బందికి ఫిర్యాదు చేయాలి. ప్రత్యేక రంగు కేటాయించిన సంచుల్లోనే వ్యర్థాలను తరలించాలి. 


వ్యర్థాల సేకరణ కేంద్రాలు సీపీసీబీ కోవిడ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అందులో వ్యర్థాల వివరాలను నమోదు చేయాలి. వ్యర్థాలను తరలించాక వాహనాలను సోడియం హైపోక్లోరైడ్‌తో శుద్ధి చేయాలి. 

Updated Date - 2020-07-08T08:11:44+05:30 IST