నిర్మాణ రంగ కార్మికులకు ఉచిత భోజనం

ABN , First Publish Date - 2020-05-17T09:41:57+05:30 IST

నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అన్నపూర్ణ పథకం ద్వారా పేదలకు రూ.5కే అందిస్తున్న భోజనాన్ని భవన నిర్మాణ కార్మికులకు పని ప్రదేశం...

నిర్మాణ రంగ కార్మికులకు ఉచిత భోజనం

పని ప్రదేశం వద్దనే  అందుబాటులోకి.. 

జీహెచ్‌ఎంసీలో పూర్తి సబ్సిడీతో ‘అన్నపూర్ణ’ 


హైదరాబాద్‌, మే 16(ఆంధ్రజ్యోతి): నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అన్నపూర్ణ పథకం ద్వారా పేదలకు రూ.5కే అందిస్తున్న భోజనాన్ని భవన నిర్మాణ కార్మికులకు పని ప్రదేశం వద్దనే ఉచితంగా అందించనుంది. రూ.24 విలువ చేసే ఈ భోజనాన్ని గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పేదలకు రూ.5కు అందిస్తున్నారు. మిగతా మొత్తాన్ని జీహెచ్‌ఎంసీ భరిస్తోంది. అయితే, లాక్‌డౌన్‌  కారణంగా చాలా రోజుల పాటు నిర్మాణ రంగం పనులు నిలిచిపోయాయి. స్థానికంగా/ పని ప్రదేశం వద్ద అందుబాటులో ఉన్న కార్మికులతో నిర్మాణ రంగ పనులు కొనసాగించుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అయితే, పని ప్రదేశంలోని కార్మికులకు అక్కడే ఉచిత భోజనాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్‌లో పరిమిత ప్రదేశాల్లో అందిస్తున్న ఈ పథకాన్ని పని గ్రేటర్‌ పరిధిలో జరిగే పని ప్రదేశాలకు విస్తరింప చేసి పూర్తి సబ్సిడీతో కార్మికులకు ఉచితంగానే భోజనం అందిస్తారు. ఈ మేరకు పలు మార్గదర్శకాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ శ నివారం ఉత్తర్వులు జారీ చేశారు. 


ఇవీ నిబంధనలు..

తెలంగాణ భవన మరియు నిర్మాణ రంగ సంక్షేమ బోర్డులో నమోదు చేసుకున్న వర్కర్లు. 

లాక్‌డౌన్‌ ముగిసేంత వరకు ఈ పథకం అమలులో ఉంటుంది. సబ్సిడీ మొత్తాన్ని జీహెచ్‌ఎంసీకి అందజేస్తారు. 

పని ప్రదేశాలు, ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వర్కర్ల వివరాలను ప్రభుత్వానికి జీహె చ్‌ఎంసీ అందించాల్సి ఉంటుంది. 

సబ్సిడీ మొత్తాన్ని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధి నుంచి జీహెచ్‌ఎంసీకి చెల్లిస్తారు. 

Updated Date - 2020-05-17T09:41:57+05:30 IST