రాష్ట్రం వచ్చాకే మహనీయుల జయంత్యుత్సవాలు

ABN , First Publish Date - 2020-08-11T08:24:58+05:30 IST

రాష్ట్రం వచ్చాకే మహనీయుల జయంత్యుత్సవాలు

రాష్ట్రం వచ్చాకే మహనీయుల జయంత్యుత్సవాలు

సర్వాయి పాపన్న జయంత్యుత్సవాల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతే ప్రముఖులు, వైతాళికులు, పండితులు, సాహితీవేత్తలు, కవు లు, చరిత్ర పురుషులు, మహనీయులను గుర్తించి జయంత్యుత్సవాలను నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ తెలిపారు. ఈ నెల 18న సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ 370వ జయంతిని పురస్కరించుకుని సోమవారం రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో ఆయన జాతీయ జయంతి వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాపన్న గౌడ్‌ బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని సాధించి పెట్టారని అన్నారు. 


Updated Date - 2020-08-11T08:24:58+05:30 IST