పృధ్వీ సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్స్‌పై సీబీఐ కేసు

ABN , First Publish Date - 2020-11-27T08:10:01+05:30 IST

తప్పుడు సమాచారంతో రుణం తీసుకుని తిరిగి చెల్లించలేకపోయిన పృధ్వీ సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఆ

పృధ్వీ సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్స్‌పై సీబీఐ కేసు

హైదరాబాద్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): తప్పుడు సమాచారంతో రుణం తీసుకుని తిరిగి చెల్లించలేకపోయిన పృధ్వీ సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌తోపాటు మరికొందరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సికింద్రాబాద్‌ రీజియన్‌ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. ఆస్తులు, సంస్థ టర్నోవర్‌కు సంబంధించిన సమాచారం తప్పుగా చూపి పృధ్వీ సోలార్‌ యాజమాన్యం ఎస్‌బీఐ నుంచి రూ.3.81 కోట్ల రుణం తీసుకుంది.


ఈ మొత్తాన్ని ఓడీలు, వ్యక్తిగత ఖాతాల్లోకి దారిమళ్లించారు. తీసుకున్న రుణం తిరిగి చెల్లించడంలో జాప్యంకావడంతో బ్యాంకు అధికారులు విషయం గుర్తించి సీబీఐకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం పృధ్వీ సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్స్‌, ఆ సంస్థ ఎండీ  బైర్రాజు శ్రీనివాస రాజు, డైరెక్టర్‌ బైర్రాజు సుశీల, పృఽధ్వీ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బ్యాంకు ప్యానెల్‌ వాల్యూవర్లు కృష్ణ, శివ రాజ కలిగతోపాటు మరికొందరిపైనా సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 


Updated Date - 2020-11-27T08:10:01+05:30 IST