బంద్‌తో టీఎన్జీవోకు ఏం సంబంధం?: బండి సంజయ్

ABN , First Publish Date - 2020-12-08T02:41:27+05:30 IST

టీఎన్జీవో నాయకుల తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బండి సంజయ్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు

బంద్‌తో టీఎన్జీవోకు ఏం సంబంధం?: బండి సంజయ్

హైదరాబాద్: టీఎన్జీవో నాయకుల తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బండి సంజయ్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ‘టీఎన్జీవో నాయకులకు రైతుల బంద్‌తో సంబంధం ఏంటి? ఉద్యోగుల సమస్యలపై కొట్లాడాల్సిన నేతలు.. సీఎం కేసీఆర్‌ అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఐఆర్‌, పీఆర్సీల గురించి మాట్లాడాల్సిన నాయకులు.. టీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాలకై ప్రకటనలిస్తున్నారు. రుణమాఫీ, కనీస మద్దతు ధరపై ఉద్యోగ సంఘాలు ఎందుకు స్పందించలేదు’ అని బండి సంజయ్ ప్రశ్నించారు.

Updated Date - 2020-12-08T02:41:27+05:30 IST