బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారిన ఎంఫాన్

ABN , First Publish Date - 2020-05-17T21:58:44+05:30 IST

బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగాఎంఫాన్ మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశాకు దక్షిణ దిశగా 990 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని అధికారులు తెలిపారు.

బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారిన ఎంఫాన్

హైదరాబాద్: బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగాఎంఫాన్ మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశాకు దక్షిణ దిశగా 990 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని అధికారులు తెలిపారు. రానున్న 12 గంటల్లో అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌- బంగ్లాదేశ్‌ తీరాల వద్ద ఈ నెల 20న సాయంత్రంలోపు తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించామని  వాతావరణశాఖ వెల్లడించింది. 48 గంటల్లో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని, మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడుతాయని వాతావరణశాఖ పేర్కొంది. ఆదివారం, సోమవారం అక్కడక్కడ ఉరుములు, ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని, ఎల్లుండి తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


Updated Date - 2020-05-17T21:58:44+05:30 IST