రైతులను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-12-14T03:42:40+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అమలు చేయకుండా మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌ అన్నారు.

రైతులను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న దుగ్యాల ప్రదీప్‌

ఏసీసీ, డిసెంబరు 13: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అమలు చేయకుండా మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యా లయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ దేశంలో మోదీ ప్రభుత్వం రైతులకు మేలు చేసే చట్టాలు తీసుకొస్తే వాటిని స్వాగతించకుండా కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీలు రైతులను రెచ్చ గొట్టి ఢిల్లీలో ధర్నాలు నిర్వహించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా దాటవేత చర్యలకు పాల్ప డుతోందన్నారు. ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ ప్రకటించిన రైతు రుణమాఫీని అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. నిర్బంధ సాగు ద్వారా కేసీఆర్‌ సన్న వడ్లను  పండించమని చెప్పి తీరా పంట చేతికొచ్చాక మద్దతు ధర చెల్లించకుండా అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్‌దేనని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన సన్నవడ్లను క్వింటాలుకు రూ.2500 చెల్లించి కొను గోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి  ఉద్యమం చేస్తామన్నారు. దేశమంతటా రైతులు మోదీ ప్రభుత్వం ప్రవేశపె ట్టిన వ్యవసాయ చట్టాల ను స్వాగతిస్తుంటే ప్రతి పక్ష పార్టీలు స్వార్థ రాజకీయాల కోసం రైతులను రెచ్చగొడుతున్నాయని  విమర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌, జిల్లా కార్యదర్శులు శ్రీనివాస్‌, మల్లేష్‌, ఉపాధ్యక్షుడు రజనీష్‌ జైన్‌, జిల్లా మహిళ మోర్చా, యువమోర్చా అధ్యక్షులు, జిల్లా అధికార ప్రతినిధి తులా మధుసూదన్‌రావు, శ్రీని వాసరావు, ప్రధానకార్యదర్శి హరికృష్ణ పాల్గొన్నారు. 

భీమారం: జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ అభినంద సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ను మండల అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్‌, నాయకులు చంద్రమౌళిలు ఘనంగా సన్మానించారు. 

Updated Date - 2020-12-14T03:42:40+05:30 IST