సామాజిక తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన అక్రమాలు

ABN , First Publish Date - 2020-12-30T06:34:02+05:30 IST

మండలంలో 2019-20లో జరిగిన మహత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీలో చేపట్టిన పనులపై గత 15 రోజుల నుండి సామాజిక బృందం గ్రామసభలు నిర్వమించి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ చేపట్టిన పనులపై తనిఖీలు నిర్వహించారు.

సామాజిక తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన అక్రమాలు
రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు

పెంబి, డిసెంబరు 29 : మండలంలో 2019-20లో జరిగిన మహత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీలో చేపట్టిన పనులపై గత 15 రోజుల నుండి సామాజిక బృందం గ్రామసభలు నిర్వమించి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ చేపట్టిన పనులపై తనిఖీలు నిర్వహించారు. సోమ వారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాల యంలో డీఆర్డీవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రజా వేది కను నిర్వహించి అర్ధరాత్రి వరకు సామాజిక బృందం చేపట్టిన తనిఖీలపై చర్చించారు. మండలంలో రూ. 27 లక్షలకు పైగా అక్రమాలు జరిగినట్లు తెలిపారు. కొన్ని గ్రామాలలో గ్రావెల్‌రోడ్డు ఏర్పాటు చేయకున్న పేమెం ట్‌ చేశారని, విలేజ్‌పార్క్‌లు, కల్లాలు, పశువుల పాకల లో అక్రమాలు జరిగినట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడ్డ వారిపై రికవరీ చేపట్టనున్నట్లు డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక తనిఖీ బృందం, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీ టీసీలు, నాయకలు, ప్రజలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T06:34:02+05:30 IST