ఉద్యోగుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-12-14T04:09:48+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు జేబీ పౌడెల్‌ అన్నారు.

ఉద్యోగుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు జేబీ పౌడెల్‌

బీజేపీ జిల్లా అధ్యక్షుడు జేబీ పౌడెల్‌

రెబ్బెన, డిసెంబరు13: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు జేబీ పౌడెల్‌ అన్నారు. ఆదివారం రెబ్బెన మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల ఐఆర్‌, డీఏ, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకుని సోమవారం అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందన్నారు. ఈ బిల్లు రైతులకు అన్ని విధాల మేలు చేసే విధంగా ఉందని రైతులు గ్రహించి ఎలాంటి అపోహలకు పోకుండా తమ పంటకు తామే ధర నిర్ణమించి నచ్చిన ప్రాంతాల్లో అమ్ముకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్‌ తాలూకా ఇన్‌చార్జి డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌, నాయకులు చక్రపాణి, కృష్ణమచారి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-14T04:09:48+05:30 IST