ఉమర్‌ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం

ABN , First Publish Date - 2020-04-28T10:05:34+05:30 IST

వివాదాస్పద పాకిస్థాన్‌ క్రికెటర్‌ ఉమర్‌ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం విధించారు. బుకీల గురించి సమాచారం తెలపక పోవడంతో అన్ని రకాల క్రికెట్‌ ...

ఉమర్‌ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం

కరాచీ: వివాదాస్పద పాకిస్థాన్‌ క్రికెటర్‌ ఉమర్‌ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం విధించారు. బుకీల గురించి సమాచారం తెలపక పోవడంతో అన్ని రకాల క్రికెట్‌ నుంచి పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) క్రమశిక్షణ కమిటీ అతడిని బహిష్కరించింది. ఈ ఏడాది పాక్‌ సూపర్‌ లీగ్‌లో మ్యాచ్‌లను ఫిక్స్‌ చేయాల్సిందిగా బుకీలు ఉమర్‌ను సంప్రదించారు. అయితే, ఈ విషయాన్ని దాచి పెట్టడంతో ఫిబ్రవరి 20నే అతడిపై తాత్కాలిక నిషేధం విధించారు. పీఎస్‌ఎల్‌కు దూరంగా ఉంచి విచారణ జరిపారు. దీంట్లో అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించినట్టు తేలడంతో క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీసీబీ ట్వీట్‌ చేసింది.


Updated Date - 2020-04-28T10:05:34+05:30 IST