అశ్విన్‌ను ఆడించకపోవడమేంటి?.. పాక్ మాజీ స్పిన్నర్ ఫైర్

ABN , First Publish Date - 2020-04-27T03:52:51+05:30 IST

భారత వన్డే క్రికెట్ జట్టులోకి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకోకపోవడంపై పాక్ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ మండిపడ్డారు.

అశ్విన్‌ను ఆడించకపోవడమేంటి?.. పాక్ మాజీ స్పిన్నర్ ఫైర్

ఇస్లామాబాద్: భారత వన్డే క్రికెట్ జట్టులోకి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకోకపోవడంపై పాక్ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ మండిపడ్డారు. అశ్విన్‌ను అలా పక్కనబెట్టడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పారు. ‘పరుగులు ఇవ్వకుండా బ్యాట్స్‌మెన్‌ను ఎవరైనా నియంత్రిస్తారు. కానీ అశ్విన్‌ వికెట్లు తీయగల బౌలర్. అలాగే పరుగులు కూడా కట్టడి చేయగలడు. అలాంటి ప్రతిభాశాలిని పక్కనెలా పెడతారు?’ అని సక్లయిన్ ముస్తాక్ ప్రశ్నించారు. క్యారం బాల్స్‌తో బ్యాట్స్‌మెన్‌కు చెమటలు పట్టించిన అశ్విన్ చివరగా 2017లో విండీస్ పర్యటనలో వన్డే మ్యాచ్ ఆడాడు.

Updated Date - 2020-04-27T03:52:51+05:30 IST