స్విస్‌ ఓపెన్‌, యూరోపియన్‌ చాంపియన్‌షి్‌ప రద్దు

ABN , First Publish Date - 2020-06-11T09:43:46+05:30 IST

ఈ సీజన్‌కు స్విస్‌ ఓపెన్‌, యూరోపియన్‌ చాంపియన్‌షిప్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) బుధవారం ...

స్విస్‌ ఓపెన్‌, యూరోపియన్‌ చాంపియన్‌షి్‌ప రద్దు

న్యూఢిల్లీ: ఈ సీజన్‌కు స్విస్‌ ఓపెన్‌, యూరోపియన్‌ చాంపియన్‌షిప్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) బుధవారం ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది మార్చి 17 నుంచి 22 వరకు స్విస్‌ ఓపెన్‌, ఏప్రిల్‌ 21 నుంచి 26 వరకు యూరోపియన్‌ టోర్నీ జరగాలి. కానీ.. కొవిడ్‌-19తో వాయిదాపడ్డ ఈ టోర్నీలకు కొత్త క్యాలెండర్‌లో స్లాట్స్‌ ఖాళీ లేకపోవడంతో రద్దు చేసినట్టు బీడబ్ల్యూఎఫ్‌ తెలిపింది. 

Updated Date - 2020-06-11T09:43:46+05:30 IST