వైరల్ వీడియో: కంటతడి పెట్టిస్తున్న గో’మాత‘ ప్రేమ!

ABN , First Publish Date - 2020-12-20T05:17:15+05:30 IST

వైరల్ వీడియో: కంటతడి పెట్టిస్తున్న గో’మాత‘ ప్రేమ!

వైరల్ వీడియో: కంటతడి పెట్టిస్తున్న గో’మాత‘ ప్రేమ!

బువనేశ్వర్: మాతృప్రేమ కేవలం మనుషులకే కాదనీ.. మూగజీవాలకు కూడా ఉంటుందని మరోసారి రుజువయ్యింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ లేగదూడను రిక్షామీద ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. తల్లి ఆవు కూడా ఆస్పత్రికి పరుగెత్తుకుని వచ్చిన వైనం చూపరుల హృదయాలను కదిలించింది. ఒడిశాలోని మల్కాన్‌గిరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కన్నబిడ్డల్ని ఆస్పత్రికి తీసుకెళ్లినప్పుడు తల్లిదండ్రులు ఎలా ఆందోళన చెందుతారో.. అచ్చం అదే మాదిరిగా ఈ వీడియోలో కనిపిస్తున్న ఆవు ఆందోళనపడుతూ కనిపించింది. లేగదూడను రిక్షామీద తీసుకుని వెటర్నరీ ఆస్పత్రికి వెళ్తుండగా... ఆ రిక్షా వెనకాలే ఆవు పరుగెట్టింది. రోడ్డు మీద అతివేగంతో వెళ్తున్న ఓ వాహనం దూడను ఢీకొట్టి వెళ్లిపోయిందనీ... గాయపడిన తన దూడ పక్కనే ఆవు దీనంగా నిలబడి వుండడంతో వెంటనే ఆస్పత్రికి తరలించామని స్థానికులు పేర్కొన్నారు.Updated Date - 2020-12-20T05:17:15+05:30 IST