చిత్తవైకల్యం గుట్టువిప్పే మెదడులోని ఇనుము!

ABN , First Publish Date - 2020-03-08T08:29:35+05:30 IST

వణుకుడు వ్యాధి ‘పార్కిన్సన్స్‌’, మతిమరుపు(అల్జీమర్స్‌), చిత్త వైకల్యం(డిమెన్షియా).. ఈ మూడు వ్యాధుల మూలం మెదడులోనే ఉందని బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు.

చిత్తవైకల్యం గుట్టువిప్పే మెదడులోని ఇనుము!

లండన్‌, మార్చి 7 : వణుకుడు వ్యాధి ‘పార్కిన్సన్స్‌’, మతిమరుపు(అల్జీమర్స్‌), చిత్త వైకల్యం(డిమెన్షియా).. ఈ మూడు వ్యాధుల మూలం మెదడులోనే ఉందని బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ మెదడులోని పలు భాగాల్లో పరిమితికి మించి ఇనుము(ఐరన్‌), హానికారక ప్రొటీన్లు పేరుకుపోవడం వల్లే ఈ వ్యాధులు వస్తుంటాయని వారు తెలిపారు. పార్కిన్సన్స్‌ బాధితుల్లో చిత్తవైకల్యం ఏ దశలో ఉందనేది తెలుసుకునేందుకు మెదడులోని ఇనుము మోతాదును ప్రామాణికంగా తీసుకోవచ్చన్నారు.

Updated Date - 2020-03-08T08:29:35+05:30 IST